టీఆర్ ఎస్‌ను హైలెట్ చేస్తున్న‌ బండి.. రేవంత్ ఇమేజ్ భ‌య‌మా..?

మొన్న‌టి వ‌ర‌కు క‌నీసం ఎలాంటి ప్ర‌భావం చూప‌ని కాంగ్రెస్‌కు ఇప్పుడు కొత్త ఉత్సాహం వ‌స్తోంది.కార‌ణం రేవంత్‌కు టీపీసీసీ చీఫ్ గా బాధ్య‌త‌లు ఇవ్వ‌డ‌మే.

అయితే రేవంత్ భ‌యం బండి సంజ‌య్‌కు బాగానే ప‌ట్టుకున్న‌ట్టు ఉంది.ఇప్ప‌టి వ‌ర‌కు టీఆర్ ఎస్‌కు తామే ప్ర‌త్యామ్నాయ‌మ‌ని, త‌మ పార్టీలోకే అంద‌రూ వ‌స్తున్నార‌ని సంతోషించిన బండికి రేవంత్ రూపంలో కొత్త స‌వాల్ ఎదుర‌వుతోంది.

దీంతో ఆయ‌న అల‌ర్ట్ అయ్యారు.రేవంత్ ఇమేజ్ పెర‌గ‌కుండా చూసేందుకు ప్లాన్ వేస్తున్నారు.

అందుకోసం కావాల‌నే బీజేపీ నేత‌లు ఎవ‌రూ కూడా రేవంత్ గురించి మాట్లాడ‌ట్లేదు.ఆయ‌న గురించి ఎలాంటి విమ‌ర్శ‌లు చేసినా ఆయ‌న ఇమేజ్ పెరుగుతుంద‌ని భావించిన క‌మ‌ల‌నాథులు కావాల‌నే ఆయ‌న్ను ప‌క్క‌న పెడుతున్నారు.

Advertisement
Bandi Sanjay Highlighting The Trs Is Revanth In Trouble, Revanth, Bjp, Politics,

ఇక టీర్ ఎస్‌ను కావాల‌నే బండి సంజ‌య్ హైలెట్ చేస్తున్నారు.టీఆర్ ఎస్‌ను బాగా హైలెట్ చేసి మాట్లాడుతూ దాన్ని ఢీకొట్టేది తామే అంటూ చెప్తున్నారు.

అంటే రేవంత్ మీద నుంచి ప్ర‌జ‌ల దృష్టిని కావాల‌నే మ‌ర‌ల్చేందుకు టీఆర్ ఎస్‌ను పిక్చ‌రైజేష‌న్‌లోకి తీసుకొస్తున్నార‌న్న మాట‌.

Bandi Sanjay Highlighting The Trs Is Revanth In Trouble, Revanth, Bjp, Politics,

టీఆర్ ఎస్ గురించి ఎంత ఎక్కువ మాట్లాడితే దాన్ని ఎదిరించేంది బీజేపీయే అని చెప్పుకోవ‌చ్చ‌న్న‌మాట‌.మొన్న‌టి వ‌ర‌కు క‌నీసం కాంగ్రెస్‌ను క‌నీసం సీరియ‌స్‌గా కూడా తీసుకోని బండి సంజ‌య్‌కు ఇప్పుడు రేవంత్ రూపంలో మ‌రో ప్రత్య‌ర్థి ఎదుర‌య్యారు.టీఆర్ ఎస్‌లోని అసంతృప్తులు బీజేపీలోకి వ‌స్తున్నార‌ని అనుకునేలోపే ఇప్పుడు వారంతా మ‌ళ్లీ కాంగ్రెస్ వైపు మ‌ళ్లే చాన్స్ ఉంద‌ని తెలుస్తోంది.

మొత్తానికి రేవంత్ ఎఫెక్ట్ అటు టీఆర్ ఎస్‌లో ఇటు బీజేపీలో కూడా బాగానే ప్ర‌భావం చూపుతోంద‌న్న మాట‌.అయితే దీన్ని రేవంత్ ఎంత వ‌ర‌కు కాపాడుకుంటార‌నేది పెద్ద ప్ర‌శ్న‌గా మారింది.

నరేష్ 1980లోనే సీరియల్స్ లో నటించాడనే విషయం మీకు తెలుసా?

మ‌రి రేవంత్ ఎఫెక్ట్ ముందు ముందు ఎలా ఉంటుంద‌నే ది చూడాలి.

Advertisement

తాజా వార్తలు