బండి సంజయ్ కి ఆ సత్తా లేదా ?

తెలంగాణ బీజేపీ( TS BJP ) అధ్యక్షుడు బండి సంజయ్( Bandi sanjay ) పై తరచూ ఏదో ఒకరకమైన విమర్శలు వినిపిస్తూనే ఉంటాయి.

ఆయన కొన్ని సందర్భాల్లో చేసే వ్యాఖ్యలు కూడా వివాదాలకు తెరతీస్తూ ఉంటాయి.

ముఖ్యంగా మత విద్వేధాలు రెచ్చగొట్టేలా వ్యాఖ్యలు చేయడం, ప్రత్యర్థి నేతలపై వ్యక్తిగత విమర్శలు చేయడం, రాజకీయ అవగాహన లేకుండా మాట్లాడడం, బీజేపీ పెద్దలకు చెప్పులు తొడగడం.ఇలా ఆయా సందర్భాల్లో బండి సంజయ్ వైఖరి పై నిత్యం ఘాటైన విమర్శలు అటు ప్రజల నుంచి ఇటు ప్రత్యర్థి పార్టీల నేతల నుంచి వినిపిస్తూనే ఉంటాయి.

కొన్ని సార్లు బండి సంజయ్ చేసే వ్యాఖ్యలు పార్టీని కూడా చిక్కుల్లోకి నేడుతుంటాయి.అలాంటి సమయాల్లో అధిష్టానం సంజాయిషీ ఇచ్చుకోవాల్సిన పరిస్థితి.

దీంతో ఆయన అధ్యక్ష పదవికి తగిన వాడు కాదని, అధిష్టానం కూడా బండి సంజయ్ ని అధ్యక్ష పదవినుంచి తప్పించేందుకు సిద్దమౌతోందని రకరకాల వార్తలు వినిపించాయి ఇప్పటికీ వినిపిస్తూనే ఉన్నాయి.అయితే బండి సంజయ్ నాయకత్వంలోనే బీజేపీ బలపడిందనేది అధిష్టానం భావిస్తోంది.అందుకే ఆయన ఎన్ని విమర్శలు, వ్యతిరేకత ఎదురవుతున్నప్పటికి బండి సంజయ్ ని అధ్యక్ష పదవిలోనే కొనసాగిస్తుంది.

Advertisement

అయితే బండి సంజయ్ కి బీజేపీని నడిపించే సత్తా లేదని ప్రత్యర్థి పార్టీల నేతలతో పాటు సొంత పార్టీ నేతలు కూడా భావిస్తున్నారా అంటే అవుననే సమాధానం వినిపిస్తోంది.ఎందుకంటే పార్టీ బలపడుతోందనే ఒట్టి మాటలు తప్పా ఇంతవరకు నియోజిక వర్గాల వారీగా బలమైన నేతలను తయారు చేయడంలో బండి ఘోరంగా విఫలం అయ్యారని సొంత పార్టీ నేతల్లోనే అసహనం ఉందట.

మరో ఐదు నెలల్లో రాష్ట్రంలో ఎన్నికలు జరగనున్నాయి.ఇప్పటివరకు క్షేత్ర స్థాయిలో పార్టీ స్థితిగతులపై కూడా బండికి అసలు క్లారిటీ లేదనే మాట వినిపిస్తోంది.ఈ నేపథ్యంలో టీపీసీసీ చీఫ్( TPCC Chief ) రేవంత్ రెడ్డి( Revanth reddy ) కూడా ఇదే విధమైన వ్యాఖ్యలు చేశారు.

బీజేపీకి 40 మంది నాయకులు కూడా లేరని, పార్టీని బలంగా నడిపించే సత్తా బండిలో లేదని బీజేపీ పార్టీ నేతలే చెబుతున్నట్లు రేవంత్ రెడ్డి ఇటీవల వ్యాఖ్యానించారు.మరి ఎన్నికలకు ఐదు నెలకు మాత్రమే సమయం ఉండడంతో ఈ కొద్ది సమయంలో పార్టీని అధికారంలోకి తెచ్చేందుకు బండి సంజయ్ ఎలాంటి వ్యూహాలతో ముందుకు సాగుతారు ? తనపై వస్తున్న విమర్శలను ఎలా తిప్పికొడతారనేది చూడాలి.

ఉల్లి తొక్కలతో ఊడిపోయే జుట్టుకు ఎలా చెక్ పెట్టవచ్చో తెలుసా?
Advertisement

తాజా వార్తలు