Sajjala Bandi Sanjay :బండి సంజయ్ కామెంట్స్ ఆన్ సజ్జల

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలను కలపాలనే ప్రతిపాదన వస్తే అందుకు తాము సిద్ధంగా ఉన్నట్లు ఏపీ ప్రభుత్వ సలహాదారుడు సజ్జల రామకృష్ణారెడ్డి చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాల్లో హాట్ టాపిక్ గా మారాయి.

ఉమ్మడి రాష్ట్రం రెండుగా విడిపోయి తొమ్మిది సంవత్సరాలు అవుతున్న ప్రస్తుత పరిస్థితుల్లో ఇలాంటి కామెంట్లు చేయడం ఎంత వరకు కరెక్ట్ అని ప్రశ్నిస్తున్నారు తెలంగాణ లీడర్లు.

తాజాగా సజ్జల రామకృష్ణారెడ్డి కామెంట్లపై బండి సంజయ్ స్పందించారు.మళ్లీ సెంటిమెంట్‌ను రగిల్చే ప్రయత్నం చేస్తున్నారని మండిపడ్డారు.

Bandi Sanjay Comments On Sajjala , Sajjala, Bandi Sanjay, Andhra Pradesh, Telang

ఇద్దరు సీఎంలు కలిసి డ్రామాలాడుతున్నారని ఘాటు వ్యాఖ్యలు చేశారు.లిక్కర్‌ స్కామ్‌పై ప్రజల దృష్టి మరల్చేందుకే ఈ డ్రామాలు చేస్తున్నారని ఆక్షేపించారు.

అవసరం వచ్చినప్పుడల్లా సెంటిమెంట్‌ను తెరపైకి తెస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.చిన్న రాష్ట్రాల ఏర్పాటుకు బీజేపీ అనుకూలంగా ఉందని బండి సంజయ్ స్పష్టం చేశారు.

Advertisement
సమాజంపై ఎంతో ఎక్కువ గా తమ ప్రభావాన్ని చూపిన చిత్రాలు ఇవే

తాజా వార్తలు