Bandi Sanjay : రాజకీయ సన్యాసం తీసుకుంటానంటూ బండి సంజయ్ సవాల్ ..!!

కాంగ్రెస్ మంత్రి పొన్నం ప్రభాకర్,( Ponnam Prabhakar ) బీజేపీ ఎంపీ బండి సంజయ్( Bandi Sanjay ) మధ్య మాటల యుద్ధం కొనసాగుతున్న సంగతి తెలిసిందే.

తాజాగా మంత్రి పొన్నంకు బండి సంజయ్ సవాల్ విసిరారు.

హుస్నాబాద్ నియోజకవర్గ అభివృద్ధిపై తాను చర్చకు సిద్ధమని తెలిపారు.నిరంతరం ప్రజల కోసం కొట్లాడే తనపై వంద కేసులు ఉన్నాయన్నారు.

ఈ క్రమంలోనే ఇతర నాయకులు ఎవరైనా ప్రజా సమస్యలపై పోరాటం చేశారా అని ప్రశ్నించారు.

ఇప్పటికే కేటీఆర్( KTR ) తీరుతో బీఆర్ఎస్( BRS ) మునిగిపోయిందన్న బండి సంజయ్ అదే తరహాలో మంత్రి పొన్నం తీరుతో కాంగ్రెస్ కూడా త్వరలో మునిగిపోవడం ఖాయమని విమర్శించారు.రానున్న లోక్ సభ ఎన్నికల్లో( Loksabha Elections ) రాజకీయ సన్యాసం తీసుకుంటానని బండి సంజయ్ తెలిపారు.ఈ క్రమంలోనే కాంగ్రెస్ అభ్యర్థి ఓటమి పాలైతే మంత్రి పొన్నం రాజకీయాల నుంచి తప్పుకుంటారా అని బండి సంజయ్ ఛాలెంజ్ చేశారు.

Advertisement
Rose Flowers Stomach Fat : గులాబీ పూలతో ఇలా చేస్తే బాన పొట్ట ఫ్లాట్ గా మారడం ఖాయం!