ఆ స్టార్ హీరో తో మల్టీస్టారర్ మూవీ కి రెఢీ అవుతున్న బాలయ్య...

తెలుగు సినిమా ఇండస్ట్రీలో ప్రస్తుతం మల్టీస్టారర్ సినిమాలా హవా నడుస్తుంది.ఇప్పటికే పవన్ కళ్యాణ్( Pawan Kalyan ) సాయి ధరమ్ తేజ హీరోలుగా బ్రో అనే మల్టీస్టారర్ సినిమా వస్తుంది.

దానికి తోడుగా ప్రస్తుతం బాలయ్య కూడా మల్టీ స్టారర్ సినిమా చేయడానికి రెడీ అవుతున్నట్లు తెలుస్తోంది.ఇక మ్యటర్లోకి వెళ్తే.

నందమూరి బాలయ్య ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకొని చేసిన సినిమా వీరసింహారెడ్డి .ఈ సినిమాలో శృతిహాసన్ -హనీ రోజ్ హీరోయిన్లుగా నటించారు .ఈ సినిమాలో బాలయ్య డ్యూయల్ పాత్రలో మెరిశారు.అంతే కాకుండా బాలయ్య కెరియర్ లోనే టాప్ కలెక్షన్స్ సాధించిన వన్ ఆఫ్ ద బిగ్ సినిమాగా రికార్డు నెలకొల్పింది వీర సింహ రెడ్డి.

అయితే ప్రెసెంట్ ఇప్పుడు అనిల్ రావిపూడి దర్శకత్వంలో భగవంత్ కేసరి అనే సినిమా చేస్తున్న బాలయ్య( Balakrishna ) .ఈ సినిమా అయిపోగానే మెగా డైరెక్టర్ బాబి దర్శకత్వంలో ఓ సినిమాకి కనెక్ట్ అయ్యాడు .ఈ సినిమాలో రకుల్ ప్రీత్ సింగ్నయనతారలు హీరోయిన్లుగా సెలెక్ట్ అయినట్టు ప్రచారం జరుగుతుంది .అయితే ఈ సినిమాలో మరో తెలుగు హీరో కూడా ఉన్నాడని.ఆ హీరో నెగటివ్ షేడ్స్ పాత్రలో కనిపించబోతున్నారని సినీ వర్గాలల్లో ఓ న్యూస్ తెగ హల్ చల్ చేస్తుంది.

Advertisement

టాలీవుడ్ మాస్ హీరోగా పేరు సంపాదించుకున్న రవితేజ( Ravi Teja ) ఈ సినిమా లో బాలయ్యతో స్క్రీన్ షేర్ చేసుకోబోతున్నాడట.బాలకృష్ణకు రవితేజ ఎంత పెద్ద వీర అభిమాని అనేది మనం ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు .ఈ క్రమంలోనే ఆయనపై ఉండే అభిమానంతో ఆయనతో ఒక్క సినిమాలో అయినా నటించాలని అనుకున్నారట.ఆల్రెడి బాబీ తో వాల్తేరు వీరయ్య సినిమాలో నటించడంతో బాబి – రవితేజల మధ్య మంచి ఫ్రెండ్షిప్ బాండింగ్ బాగా కుదిరింది.

ఈ క్రమంలోనే ఆయన ఈ సినిమాలో ఈ పాత్ర కోసం రవితేజను చూస్ చేసుకున్నారట .దీంతో సోషల్ మీడియాలో ఈ న్యూస్ వైరల్ గా మారింది.ఇద్దరు మాస్ హీరోలను తెర పై ఒక్కేసారి చూస్తే ఎలా ఉంటాది.

అభిమానులకి పండగే పండగా అంటూ కామెంట్లు పెడుతున్నారు.

మచ్చలు పోయి ముఖం తెల్లగా మారాలా.. అయితే ఈ రెమెడీని మీరు ట్రై చేయాల్సిందే!
Advertisement

తాజా వార్తలు