చిరంజీవి ఖాతాలో బాలయ్య డైరెక్టర్...

మెగాస్టార్ చిరంజీవి ( Megastar Chiranjeevi )కుర్ర హీరోలతో పోటీ పడుతూ వరుస సినిమాలతో దూసుకుపోతున్నారు.

ఆయన ఆగస్టు 11న భోళా శంకర్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు రానున్నారు.

దీని తర్వాత కళ్యాణ్ కృష్ణ దర్శకత్వంలో సినిమా మొదలుపెట్టనున్నారు.అలాగే డైరెక్టర్ మల్లిడి వశిష్ట్ ప్రాజెక్ట్ కూడా లైన్ లో ఉంది.

ఇదిలా ఉంటే ఇప్పుడు ఈ లిస్టులోకి అనిల్ రావిపూడి వచ్చి చేరినట్లు తెలుస్తోంది.

టాలీవుడ్ లో సక్సెస్ ఫుల్ దర్శకులలో ఒకరిగా పేరు తెచ్చుకున్న అనిల్ రావిపూడి( Anil Ravipudi ).ప్రస్తుతం నటసింహం నందమూరి బాలకృష్ణ హీరోగా భగవంత్ కేసరి( Bhagwant Kesari ) సినిమా చేస్తున్నారు.ఈ చిత్రం ఈ ఏడాది దసరాకు విడుదల కానుంది.

Advertisement

దీని తర్వాత ఆయన చేయబోయే సినిమా చిరంజీవితోనే అని న్యూస్ వినిపిస్తోంది.ఇప్పటికే అనిల్ చెప్పిన స్టోరీ లైన్ చిరంజీవికి నచ్చిందని, భగవంత్ కేసరి విడుదలయ్యాక అనిల్ పూర్తి స్క్రిప్ట్ ని సిద్ధం చేసి చిరుకి వినిపిస్తారని టాక్.

అన్ని అనుకున్నట్టు జరిగితే వచ్చే ఏడాది ద్వితీయార్థంలో ఈ సినిమా సెట్స్ పైకి వెళ్లనుందని సమాచారం.

ఇక ఇది ఇలా ఉంటే ఈ మధ్య చిరంజీవి కుర్ర డైరక్టర్ల తో ఎక్కువ సినిమాలు చేస్తున్నట్టు గా తెలుస్తుంది.ఎందుకంటే వాళ్లైతేనే చిరంజీవి ని చాలా బాగా చూపిస్తారు అని అనుకుంటున్నాడు.నిజానికి చిరుననే 90 s కిడ్స్ కి చాలా ఇష్టం ప్రస్తుతం ఉన్న డైరెక్టర్లలో చాలా మంది వాళ్లే ఉన్నారు కాబట్టి చిరంజీవి గారితో చేయడం వల్ల డ్రీమ్ లాగా ఫీల్ అయిపోయి చేసేస్తున్నారు.

jamuna, Relangi : రేలంగి మాటలకు హీరోయిన్ జమున జంప్..కారణం ఏంటి ?
Advertisement

తాజా వార్తలు