బాలకృష్ణ అన్ స్టాపబుల్(UnStoppable With NBK) కార్యక్రమానికి వ్యాఖ్యాతగా వ్యవహరిస్తున్న విషయం మనకు తెలిసిందే.
ఆహలో ప్రసారమవుతున్నటువంటి ఈ కార్యక్రమం మొదటి రెండు ఎపిసోడ్లు ప్రసారమయ్యే ఎంతో అద్భుతమైన విజయాన్ని అందుకున్నాయి.
ఇక తాజాగా కార్యక్రమానికి సంబంధించి మూడవ సీజన్ కూడా ప్రారంభమైన విషయం మనకు తెలిసిందే.ఈ సీజన్లో భాగంగా మొదటి ఎపిసోడ్ అక్టోబర్ 17వ తేదీ ప్రసారమైంది ఈ మొదటి సీజన్లో భాగంగా బాలకృష్ణ హీరోగా నటించిన భగవంత్ కేసరి (Bhagavanth Kesari) సినిమా టీం నుంచి డైరెక్టర్ తో పాటు హీరోయిన్స్ కాజల్ అగర్వాల్(Kajal Aggarwal) శ్రీ లీల (Sreeleela) కూడా హాజరై సందడి చేశారు అలాగే విలన్ అర్జున్ రాంపాల్ కూడా ఈ కార్యక్రమంలో సందడి చేశారు.
ఇలా ఈ కార్యక్రమానికి అతిధులుగా హాజరైనటువంటి వీరందరితో బాలయ్య ( Balakrishna ) ఎంతో సరదాగా ముచ్చటించారు.సినిమాలకు సంబంధించిన విషయాలతో పాటు వ్యక్తిగత విషయాల గురించి కూడా మాట్లాడారు.
అయితే ఈ కార్యక్రమంలో భాగంగా సామాజిక సేవ చేసే వారి గురించి బాలయ్య ప్రస్తావిస్తూ వారిని ప్రశంసిస్తూ పొగుడుతూ ఉంటారు.ఈ క్రమంలోనే సొంత గ్రామానికి కనీసం వెళ్లడానికి దారి లేకపోవడంతో సొంత ఇంటిని నిర్మించుకోవడం కోసం దాచుకున్న డబ్బుని రోడ్డు వేయడం కోసం ఉపయోగించినటువంటి ఆశ వర్కర్ జిమ్మిని(Jimmi) వేదిక పైకి పిలిచి బాలకృష్ణ సత్కరించారు.
ఆడపిల్ల అంటే జింక లెక్క కాదు.పులి లెక్క ఉండాలే అని భగవంత్ కేసరిలో బాలకృష్ణ చెప్పిన డైలాగ్ బాగా జనాలకి బాగా కనెక్ట్ అయింది.
అయితే నిజ జీవితంలో ఆడపులిని వేదిక పైకి పిలిచి బాలయ్య సత్కరించిన తీరు అందరిని ఆకట్టుకుంది.తోటగుట్టిపట్టు గిరిజన తాండాకు చెందిన జిమ్మీ గత నాలుగు సంవత్సరాలుగా ఆశ వర్కర్ గా( Asha Worker ) పనిచేస్తూ గ్రామంలో ఎవరికీ ఏ అవసరం వచ్చిన ముందుండి వారి అవసరాలను తీరుస్తుంది.ఎవరికైనా బాగా లేకపోతే మందులు ఇస్తుంది ఏ గర్భిణీకైనా నొప్పులు వస్తే ఆసుపత్రికి తీసుకువెళ్తుంది.
అయితే తన గ్రామానికి అత్యవసరంగా ఏదైనా ఒక వాహనం రావాలి అంటే సరైన రోడ్డు లేదు ఇలా రోడ్డు లేని కారణంగా సరైన సమయంలో చికిత్స అందక తన పిన్ని చనిపోయారని ఇలాంటి మరణం మరొకరికి రాకూడదన్న ఉద్దేశంతో సొంత ఇంటికి కోసం దాచుకున్న డబ్బులతో రోడ్డు వేయించి( Road ) ఆదర్శంగా నిలిచారు.
ఈ విషయంలో తన భర్త కూడా తనకు అండగా నిలిచారు అంటూ జిమ్మీ తెలిపారు.అనంతరం బాలకృష్ణ మాట్లాడుతూ.ప్రజల కోసం నువ్వు నిలబడిన వైనం.నిన్ను అన్‌స్టాపబుల్ చేసింది అంటూ ఆమెపై ప్రశంసలు కురిపించడమే కాకుండా భగవంత్ కేసరి నిర్మాత సాహు గారపాటి( Producer Sahu Garapati ) ఆశా వర్కర్ చేస్తోన్న మంచి పనిని మెచ్చుకుంటూ రూ.2 లక్షల చెక్‌ను బాలయ్య, కాజల్ చేతుల మీదుగా అందజేశారు.అలాగే స్పాన్సర్స్ నుంచి మరో రూ.50 వేలు చెక్‌ను కూడా జిమ్మీకి అందజేశారు.ప్రస్తుతం ఇందుకు సంబంధించినటువంటి వీడియోలు ఫోటోలు వైరల్ అవుతున్నాయి.
తాజా వార్తలు
Download App
Channels
HomeEnglish NewsTeluguStop Exclusive StoriesFlash/Breaking NewsTrending NewsPoliticalMovieHealth TipsCrime NewsMovie ReviewsNRI NewsViral VideosBhakthi/DevotionalPress ReleasesViral StoriesQuotesPhoto TalksBaby Boy NamesBaby Girl NamesCelebrity ProfilesFollow Us!
Contact Us!
TeluguStop.com Media, Siya Residency, Sri Sri Circle, Khammam, Telangana- 507002info@telugustop.comPh No : 999-279-9973
About Us!
About UsJobsAdvertisingDMCA / RemovalTerms of UsePrivacy Policy