ఆ ముదురు ముద్దుగుమ్మ‌కు బాల‌య్య వార్నింగ్‌

నంద‌మూరి న‌ట‌సింహం యువ‌ర‌త్న బాలకృష్ణ-పూరీ జగన్నాథ్ కాంబినేష‌న్‌లో తెర‌కెక్కుతోన్న సినిమా షూటింగ్ శ‌ర‌వేగంగా జ‌రుగుతోంది.

బాల‌య్య ఓ సారి ఓ ద‌ర్శ‌కుడికి క‌మిట్ అయితే సినిమాలో అస్స‌లు వేలుపెట్ట‌రు.

అయితే ఈ సినిమా విష‌యంలో మాత్రం బాల‌య్య ఇన్వాల్‌మెంట్ కాస్త ఎక్కువ‌గానే ఉంద‌ట‌.అయితే ఈ విష‌యంలో బాల‌య్య‌ను త‌ప్పుప‌ట్ట‌డానికేం లేదు.

పూరి వ‌రుస డిజాస్ట‌ర్ల మీద డిజాస్ట‌ర్లు తీస్తున్నాడు.టెంప‌ర్ త‌ర్వాత నాలుగు వ‌రుస డిజాస్ట‌ర్లు ఇచ్చాడు.

బాల‌య్య అస‌లేం ప‌ట్టించుకోక‌పోతే పూరి త‌న‌కు న‌చ్చినట్టు సినిమాను చుట్టేస్తాడు.ఈ క్ర‌మంలోనే ఈ సినిమాలో ఓ ఐటెం సాంగ్‌లో బాల‌య్య ప‌క్క‌న చిందేసేందుకు చార్మిని పూరి ఫిక్స్ చేసేశాడ‌ట‌.

Advertisement

ప్ర‌స్తుతం పూరి - చార్మీ మ‌ధ్య ఎంత స్ట్రాంగ్ రిలేష‌న్ ఉందో తెలిసిందే.తాను ఏం చేసినా బాల‌య్య నో చెప్ప‌డ‌న్న ఉద్దేశంతో పూరి ఐటెం సాంగ్‌కు చార్మీని ఫిక్స్ చేశాడ‌ట‌.

అయితే బాల‌య్య మాత్రం చార్మీని తీసేయ‌మ‌ని మొహ‌మాటం లేకుండా పూరికి వార్నింగ్ ఇచ్చాడ‌ట‌.దీంతో షాక్ తిన‌డం పూరి-చార్మీ వంత‌య్యింద‌ట‌.

దీంతో పూరి వెంట‌నే చార్మీ ప్లేసులో కైరా దత్ అనే బాలీవుడ్ హాట్ భామని తీసుకున్నాడు.ఏదేమైనా గ‌తంలో కూడా పూరి - నితిన్ మ‌ధ్య సైతం దూరిన చార్మి ఆ ప్రాజెక్టు క్యాన్సిల్ అయ్యే వ‌ర‌కు తీసుకెళ్లింది.

ఇప్పుడు బాల‌య్య ప్రాజెక్టులోను ఏదోలా దూరేయాల‌నుకున్న ఈ ముదురు ముద్దుగుమ్మ‌కు బాల‌య్య షాక్ గ‌ట్టిగానే త‌గిలింద‌న్న చ‌ర్చ‌లు ఇండ‌స్ట్రీలో వినిపిస్తున్నాయి.

Karamba Review And Player Reputation — A Practical UK Guide
Advertisement