బాలయ్య గోడును పట్టించుకోని పోలీసులు

హిందుపురం ఎమ్మెల్యే, నటుడు నందమూరి బాలకృష్ణకు తాజాగా చేదు అనుభవం ఎదురైన ఘటన గురించి తెలిసిందే.

తన నియోజకవర్గంలో ఓ వేడుకకు హాజరయ్యేందుకు హిందుపురం వెళ్లిన బాలయ్యను దారిమధ్యలో కొందరు గ్రామస్థులు అడ్డుకొని నిరసన వ్యక్తం చేశారు.

కాగా ఈ ఘటనను ముందే ఊహించిన బాలయ్య తనకు సెక్యురిటీ కావాలంటూ పోలీసు వారిని కోరాడట.తనకు ఎస్కోర్ట్ వాహనం అందించాల్సిందిగా అధికారులను కోరాడట బాలయ్య.

కానీ తన గోడును ఎవరూ పట్టించుకోలేదని ఆయన ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.తన నియోజకవర్గంలో కొంతమేర తనకు వ్యతిరేకత ఉన్న ప్రజలు ఉన్నారని.

వారి నుండి తనకు హాని జరుగవచ్చని బాలయ్య వేడుకున్నారట.అయినా పోలీసులు ఆయన గోడును పెడచెవిన పెట్టడంతోనే కొందరు గ్రామస్తులు ఆయన్ను దారి మధ్యలో అడ్డగించి నానా హంగామా చేశారని బాలయ్య వర్గీయులు అంటున్నారు.

Advertisement

ఏదేమైనా తన గోడును ఏపీ ప్రభుత్వ అధికారులు కావాలనే పట్టించుకోలేదని బాలయ్య అన్నట్లు తెలుస్తోంది.ప్రస్తుతం బాలయ్యను దారిమధ్యలో అడ్డుకున్న విషయం రాష్ట్రం మొత్తం హాట్ టాపిక్‌గా మారడం గమనార్హం.

లైంగిక శ‌క్తిని దెబ్బ‌తీసే ఈ ఆహారాల‌తో జ‌ర జాగ్ర‌త్త‌!
Advertisement

తాజా వార్తలు