స్టార్ హీరో అల్లు అర్జున్ కు ఫోన్ చేసిన బాలయ్య.. అసలేం జరిగిందంటే?

టాలీవుడ్ ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ కు( Allu Arjun ) ప్రేక్షకుల్లో అంచనాలకు మించి క్రేజ్, ఫ్యాన్ ఫాలోయింగ్ పెరుగుతోంది.

తాజాగా అల్లు అర్జున్ బెయిల్ పై విడుదలైన సంగతి తెలిసిందే.

అల్లు అర్జున్ కావాలని చేయకపోయినా ఊహించని విధంగా వివాదంలో చిక్కుకుని న్యాయపరమైన సమస్యలను ఎదుర్కొంటున్నారు.ఇప్పటికే పలువురు సెలబ్రిటీలు బన్నీని డైరెక్ట్ గా కలిసి ధైర్యం చెప్పే ప్రయత్నం చేశారు.

తాజాగా ఆ జాబితాలో బాలయ్య( Balayya ) కూడా చేరారు.బాలయ్య బన్నీకి ఫోన్ చేసి కొంత సమయం పాటు ముచ్చటించారు.

బాలయ్య తనకు ఫోన్ చేయడంతో బన్నీ ఆయనకు థ్యాంక్స్ చెప్పారు.బన్నీ కష్టాల్లో ఉన్న సమయంలో బాలయ్య అండగా నిలబడటాన్ని నెటిజన్లు మెచ్చుకుంటున్నారు.

Advertisement
Balakrishna Phone Call To Star Hero Allu Arjun Details, Balakrishna, Allu Arjun,

బాలయ్య ప్రస్తుతం అన్ స్టాపబుల్ షోతో బిజీగా ఉన్న సంగతి తెలిసిందే.అన్ స్టాపబుల్ సీజన్4( Unstoppable Season 4 ) ఆశించిన స్థాయిలో సక్సెస్ సాధించలేదు.

Balakrishna Phone Call To Star Hero Allu Arjun Details, Balakrishna, Allu Arjun,

బాలయ్య బన్నీ కాంబినేషన్ లో సినిమా రావాలని ఫ్యాన్స్ కోరుకుంటుండగా ఈ కాంబో సాధ్యమవుతుందో లేదో చూడాల్సి ఉంది.బాలయ్య ప్రస్తుతం డాకు మహారాజ్( Daku Maharaj ) సినిమాతో బిజీగా ఉన్నారు.డాకు మహారాజ్ ఫస్ట్ సింగిల్ ఈరోజు సాయంత్రం 6 గంటల 16 నిమిషాలకు రిలీజ్ కానుంది.

ఈ ఫస్ట్ సింగిల్ కు సంబంధించిన ప్రోమో ఇప్పటికే ప్రేక్షకులను ఎంతగానో మెప్పించింది.

Balakrishna Phone Call To Star Hero Allu Arjun Details, Balakrishna, Allu Arjun,

సంక్రాంతికి విడుదల కానున్న అన్ని సినిమాల నైజాం హక్కులు దిల్ రాజు సొంతం కాగా గాడ్ ఆఫ్ మాసెస్ బాలకృష్ణ డాకు మహారాజ్ తో భారీ హిట్ అందుకుంటారని ఫ్యాన్స్ ఫీలవుతున్నారు.డాకు మహారాజ్ బాక్సాఫీస్ ను షేక్ చేయడం పక్కా అని కామెంట్లు వినిపిస్తున్నాయి.బాలయ్య సినిమాల బడ్జెట్లు సైతం అంతకంతకూ పెరుగుతున్నాయి.

న్యూస్ రౌండప్ టాప్ 20

తెలుగు రాష్ట్రాల్లో రికార్డ్ స్థాయి స్క్రీన్లలో డాకు మహారాజ్ మూవీ రిలీజ్ కానుందని సమాచారం అందుతోంది.

Advertisement

తాజా వార్తలు