నందమూరి బాలకృష్ణ హోస్ట్ గా వ్యవహరిస్తున్న అన్ స్టాపబుల్ కార్యక్రమం పవన్ కళ్యాణ్ ఎపిసోడ్ కోసం ప్రేక్షకులు అంతా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.
ఎట్టకేలకు పవన్ కళ్యాణ్ ఎపిసోడ్ స్ట్రీమింగ్ కి సంబంధించిన తేదీ వచ్చేసింది.
ఫిబ్రవరి మొదటి వారం లో ఈ ఎపిసోడ్ స్ట్రీమింగ్ చేయబోతున్నట్లుగా ఆహా అధికారికంగా ప్రకటించింది.ఎప్పుడు లేనంతగా బజ్ ఈ ఎపిసోడ్ కి క్రియేట్ అయింది అనేది అందరికీ తెలిసిన విషయమే.
అందరు భావించినట్లుగానే పవన్ కళ్యాణ్ ఎపిసోడ్ ని రెండు ఎపిసోడ్స్ గా విభజించి స్ట్రీమింగ్ చేయబోతున్నట్లుగా ఆహా వారు అధికారికంగా పేర్కొన్నారు.పవన్ కళ్యాణ్ మరియు బాలకృష్ణ మధ్య ఆసక్తికర సంభాషణలు జరిగాయని వాటన్నింటినీ కూడా ఒక్క ఎపిసోడ్ లో చూడడం కష్టం కనుక రెండు ఎపిసోడ్స్ గా ప్రేక్షకుల ముందుకు తీసుకు రాబోతున్నట్లుగా ఆహా వారు ప్రకటించారు.
ఇదే సమయం లో ఈ సీజన్ యొక్క చివరి ఎపిసోడ్ గా పవన్ కళ్యాణ్ ఎపిసోడ్ ఉంటుంది అంటూ కూడా ప్రచారం జరుగుతుంది.
బాలకృష్ణ ప్రస్తుతం అనిల్ రావిపూడి దర్శకత్వం లో రూపొందుతున్న సినిమా కు సంబంధించిన షూటింగ్ తో బిజీగా ఉన్నాడు.మరో వైపు అల్లుడు నారా లోకేష్ పాదయాత్ర చేస్తున్నాడు.ఆ పాద యాత్ర కు సంబంధించిన వ్యవహారాలు కూడా చూసుకోవాల్సి ఉంది.సినిమా లు మరియు రాజకీయాలతో చాలా బిజీగా ఉన్న బాలకృష్ణ టాక్ షో విషయం లో కాస్త గ్యాప్ ఇవ్వాలని భావిస్తున్నాడని,
అందుకే పవన్ కళ్యాణ్ ఎపిసోడ్ తో సీజన్ 2 కి ఎండ్ కార్డ్ వెయ్యాలని భావిస్తున్నారట.వచ్చే ఏడాది సీజన్ 3 ని ప్రేక్షకుల ముందుకు తీసుకు వచ్చేలా ప్లాన్ చేస్తున్నారట.ఇక పవన్ సినిమాల విషయానికి వస్తే హరి హర వీరమల్లు సినిమా షూటింగ్ దశలో ఉంది.
మరో వైపు మూడు నాలుగు సినిమాలు చర్చల దశలో ఉన్నాయి.ఇప్పటికే వాటికి సంబంధించిన ప్రకటన వచ్చింది.షూటింగ్ ప్రారంభం కావాల్సి ఉంది.
తాజా వార్తలు
Download App
Channels
HomeEnglish NewsTeluguStop Exclusive StoriesFlash/Breaking NewsTrending NewsPoliticalMovieHealth TipsCrime NewsMovie ReviewsNRI NewsViral VideosBhakthi/DevotionalPress ReleasesViral StoriesQuotesPhoto TalksBaby Boy NamesBaby Girl NamesCelebrity ProfilesFollow Us!
Contact Us!
TeluguStop.com Media, Siya Residency, Sri Sri Circle, Khammam, Telangana- 507002info@telugustop.comPh No : 999-279-9973
About Us!
About UsJobsAdvertisingDMCA / RemovalTerms of UsePrivacy Policy