దసరాకి వద్దంటున్న బాలయ్య..!

నందమూరి బాలకృష్ణ ప్రస్తుతం గోపీచంద్ మలినేని డైరక్షన్ లో సినిమా చేస్తున్న విషయం తెలిసిందే.ఈ సినిమాకు జై బాలయ్య అనే టైటిల్ పరిశీలనలో ఉంది.

క్రాక్ తో సూపర్ హిట్ అందుకున్న గోపీచంద్ బాలయ్యతో దాన్నిమించి హిట్ కొట్టాలని చూస్తున్నాడు.ఇప్పటికే సినిమా షూటింగ్ సగానికి పైగా పూర్తి కాగా త్వరలో సినిమా టీజర్ ఒకటి రిలీజ్ చేస్తారని తెలుస్తుంది.

ఇక ఈ సినిమా రిలీజ్ దసరాకి అని ముందు అనుకున్నారు.కానీ బాలకృష్ణ సినిమాని దసరాకి వద్దని అంటున్నాడట.అఖండ సినిమా రిలీజ్ నాడే ఈ సినిమాని కూడా రిలీజ్ చేయాలని అంటున్నారట.2021 డిసెంబర్ 1న అఖండ రిలీజైంది.ఇక ఆ సినిమా సృష్టించిన సంచలనాలు అందరికి తెలిసిందే.

బాలయ్య స్టామినా ఏంటన్నది మరోసారి అందరికి తెలిసేలా చేసింది అఖండ.అందుకే దసరాకి అనుకున్న బాలయ్య 107వ సినిమా డిసెంబర్ కి వాయిదా వేస్తున్నారట.

Advertisement

ఈ సినిమా కూడా గోపీచంద్ ఎక్కడ కాంప్రమైజ్ అవకుండా తెరకెక్కిస్తున్నారని తెలుస్తుంది.ఎన్.బి.కె 107 తర్వాత నెక్స్ట్ సినిమా సక్సెస్ ఫుల్ డైరక్టర్ అనీల్ రావిపుడితో సినిమా లైన్ లో పెట్టాడు బాలయ్య బాబు.

Felix Spin — Die Besten Spiele Und Slots Im Vergleich
Advertisement