ఓటీటీల గురించి షాకింగ్ కామెంట్స్ చేసిన బాలకృష్ణ.. ఇండస్ట్రీకి కాంపిటీషన్ అంటూ?

టాలీవుడ్ ఇండస్ట్రీలో నటుడిగా ఖ్యాతి పొందిన దివంగత నటుడు నందమూరి తారకరామారావు గురించి తెలియని వారంటూ ఉండరు.

తన నటనతో ప్రేక్షకుల అభిమాన దేవుడిగా గుర్తింపు పొందిన నందమూరి తారక రామారావు వారసుడిగా ఇండస్ట్రీలో అడుగుపెట్టిన నందమూరి బాలకృష్ణ కూడా తన తండ్రి పేరుని నిలబెడుతూ స్టార్ హీరోగా గుర్తింపు పొందాడు.

ప్రస్తుతం వరుస సినిమాలలో నటిస్తూ బిజీగా ఉన్న బాలకృష్ణ ఇటీవల కాచిగూడలోని‘తారకరామ’ థియేటర్ ప్రారంభోత్సవంలో పాల్గొన్నారు.నారాయణ్ కె దాస్ నారంగ్, ఆయన కుమారులు సునీల్ నారంగ్, భరత్ నారంగ్, నట సార్వభౌమ నందమూరి తారక రామారావు గారి పై ఉన్న అభిమానంతో ‘ఏషియన్ తారకరామ’ అనే పేరుతో థియేటర్ని పునరుద్ధరించారు.

ఇటీవల ఈ థియేటర్ పునః ప్రారంభోత్సవం చాలా ఘనంగా నిర్వహించారు. నందమూరి బాలకృష్ణ , ప్రొడ్యూసర్ శిరీష్ చేతులు మీదగా ఈ ప్రారంభోత్సవం చాలా ఘనంగా జరిగింది.

ఈ వేడుకలో నందమూరి బాలకృష్ణ మాట్లాడుతూ.నాకు ధన్యమైన జన్మనిచ్చి, నన్ను మీ అందరి గుండెల్లో శాశ్వతంగా పెద్దాయన ప్రతిరూపంగా నిలిపిన దైవాంశ సంభూతుడు, విశ్వ విఖ్యాత నట సార్వభౌమ నా కన్నతండ్రి, నా గురువు, దైవం, ఆ కారణజన్ముడికి ఈ శత జయంతి సందర్భంగా నా అభినందనలు తెలియజేస్తున్నాను అంటూ తన తండ్రి గురించి గొప్పగా చెప్పుకొచ్చాడు.

Advertisement

చిత్ర పరిశ్రమ మద్రాస్ లో వున్నప్పుడు ఇక్కడ ఎన్టీఆర్ ఎస్టేట్ ప్రారంభించి ఉమ్మడి తెలుగు రాష్ట్రాలలో తన ప్రస్థానం మొదలుపెట్టారని బాలకృష్ణ వెల్లడించారు.

గతంలో ఎన్టీఆర్ ఎస్టేట్ కూడా ఒక పర్యటక స్థలంగా వుండేది.అలాగే ఈ థియేటర్ కి కూడా ఒక చరిత్ర వుంది.బసవతారకం క్యాన్సర్ హాస్పిటల్ మా అమ్మగారి జ్ఞాపకార్ధం కట్టిన ఓ దేవాలయం అయితే తారకరామ థియేటర్ కూడా అమ్మ నాన్నగారి పేర్లు కలిసివచ్చేటట్లు కట్టిన దేవాలయం అని వెల్లడించాడు.

అలాగే ప్రస్తుతం ఓటీటీ రూపంలో ఇండస్ట్రీకి ఒక పెద్ద కాంపిటేషన్ వుంది అంటూ ఓటిటి గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు.ప్రేక్షకులకు మంచి సినిమాలు అందించటమే లక్ష్యంగా పనిచేయాలని చెప్పుకొచ్చాడు.

అలాగే సునీల్ నారంగ్ టికెట్ ధరలు అందరికి అందుబాటులో ఉండేలా పెట్టారని ఆయన చెప్పుకొచ్చాడు.

అక్కినేని ఫ్యామిలీ హీరోలకు ముందుకి వెళ్లే ఛాన్స్ లేదా??
Advertisement

తాజా వార్తలు