మ‌రో కొత్త సేవ‌కు శ్రీకారం చుట్టిన న‌టుడు బాల‌కృష్ణ‌

హిందూపురం ఎమ్మెల్యే, నటుడు బాల‌కృష్ణ మ‌రో కొత్త సేవ‌కు శ్రీకారం చుట్టారు.

నియోజ‌క‌వ‌ర్గంలోని పేద‌లకు ఉచిత వైద్యాన్ని అందించాల‌నే ఉద్దేశంతో ఎన్టీఆర్ ఆరోగ్య ర‌థంను ప్రారంభించేందుకు స‌న్నాహాలు చేస్తున్నారు.

ఇప్ప‌టికే హిందూపురంలో అన్నా క్యాంటీన్ ను ప్రారంభించిన బాల‌య్య‌.త‌క్కువ ధ‌ర‌లో ఆహారం అందిస్తున్నారు.

అంతేకాకుండా బ‌స‌వ‌తార‌కం క్యాన్స‌ర్ ఆస్ప‌త్రి ఛైర్మ‌న్ గా ఉండి అనేక మందికి సేవలు అందిస్తున్నారు.తాజాగా రూ.40 ల‌క్ష‌ల వ్య‌యంతో ఎన్టీఆర్ ఆరోగ్య ర‌థాన్ని త‌యారు చేయించారు.గ్రామాల్లో ప్ర‌జ‌ల‌కు వైద్యం అందించేందుకు ఇది ఎంతగానో ఉప‌యోగ‌ప‌డుతుంది.

దీనిపై నియోజ‌క‌వ‌ర్గ ప్ర‌జ‌లు హ‌ర్షం వ్య‌క్తం చేస్తున్నారు.

Advertisement
Validation Check 2026