బాలయ్య 'అన్ స్టాపబుల్ 3 ' కి ముహూర్తం ఫిక్స్..మొదటి గెస్ట్ ఎవరంటే!

ఓటీటీ ప్లాట్‌ఫామ్‌లో సంచలనం సృష్టించిన టాక్ షోలలో బాలకృష్ణ హోస్ట్ చేసిన అన్‌స్టాపబుల్ ఒకటి.

రెండు సీజన్‌లను విజయవంతంగా పూర్తి చేసుకున్న అన్‌స్టాపబుల్ షో సీజన్ 3 త్వరలో ప్రారంభం కానుంది.

వివరాల్లోకి వెళితే.నందమూరి నటసింహ భారీ డైలాగులు, క్రేజీ ఫైట్లతో సినిమాల్లో బాలయ్య( Balakrishna ) పాపులర్ అయితే.

తిరుగులేని టాక్ షో ద్వారా ఆయనలోని కొత్త సరికొత్త కోణం బయటకు వచ్చింది.సినిమాల్లో కంటే ఈ టాక్ షోలో ఆయన చమత్కారం, కామెడీ టైమింగ్ ఎక్కువగా చూశాం.

అందుకే ప్రముఖ తెలుగు ఓటీటీ ప్లాట్‌ఫామ్ ఆహాలో ప్రసారమై మొదటి రెండు సీజన్లు సంచలన విజయం సాధించాయి.

Balakrishna Fixed The Moment For unstoppable 3 Who Is The First Guest , Unsto
Advertisement
Balakrishna Fixed The Moment For 'Unstoppable 3 Who Is The First Guest! , Unsto

అన్ స్టాపబుల్ సీజన్ 2 నారా చంద్రబాబు నాయుడు, లోకేష్‌లతో మొదలై పవర్ స్టార్ పవన్ కళ్యాణ్‌తో ముగిసింది.మొదటి ఎపిసోడ్ తీవ్ర వివాదాన్ని ఎదుర్కొంది.పవన్ కళ్యాణ్ ఎపిసోడ్ రికార్డులను బద్దలు కొట్టింది.

దీనికి ఆల్ టైమ్ వ్యూస్ వచ్చాయి.ఇప్పుడు ఆహా త్వరలో అన్‌స్టాపబుల్ సీజన్ 3( Unstoppable Season 3 )ని లాంచ్ చేయడానికి ప్లాన్ చేస్తున్నట్లు టాక్.

ప్రస్తుత ఆయన రాజకీయాలు, సినిమాలతో బిజీగా ఉన్నప్పటికీ సీజన్ 3ని ప్రారంభించాలనుకుంటున్నారు.ఈ సీజన్‌లో సినీ ప్రముఖుల కంటే రాజకీయ ప్రముఖులనే గెస్ట్‌లుగా తీసుకురానున్నారు.

మంత్రి కెటిఆర్, మెగాస్టార్ చిరంజీవి, పురందేశ్వరి వంటి అగ్ర రాజకీయ నాయకులను పిలిపించే ఆలోచనలో ఉన్నట్లు సమాచారం./br>

Balakrishna Fixed The Moment For unstoppable 3 Who Is The First Guest , Unsto
నరేష్ 1980లోనే సీరియల్స్ లో నటించాడనే విషయం మీకు తెలుసా?

ఇదే నిజమైతే బాలయ్యతో చిరంజీవి, కేటీఆర్( KTR ) ఒకే వేదికపై కనిపిస్తే రాజకీయంగానూ, సినీ పరంగానూ సంచలనం అవుతుంది.దానికి తోడు మరికొద్ది రోజుల్లో ఎన్నికలు రాబోతున్నాయి.ఈ నేపథ్యంలో బాలయ్య హోస్టింగ్ ద్వారా మళ్లీ టీడీపీ అధికారంలోకి వచ్చే అవకాశం ఉందని పలువురు బాలయ్యకు సలహా ఇవ్వడంతో సమయం లేకున్నా షో హోస్ట్ చేసేందుకు ఒప్పుకున్నారు.

Advertisement

ఇటీవలే అల్లు అరవింద్‌ అన్ స్టాపబుల్ సీజన్ 3కి మొదటి గెస్ట్ గా తీసుకురావడంలో చొరవ చూపినట్లు తెలుస్తోంది.భారీ అంచనాలు ఏర్పడే ఈ ఎపిసోడ్ ను రెండు పార్ట్ లు గా తీసుకు రావాలని షో మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు.

మొత్తానికి బాలయ్య బాబు, చిరంజీవిని ఒకే స్టేజ్ పై చూడబోతున్నందుకు చాలా సంతోషంగా ఉందంటూ వారి ఫ్యాన్స్ కామెంట్స్ చేస్తున్నారు.

తాజా వార్తలు