బాలయ్య మూవీ రెండో వారం కలెక్షన్స్ పరిస్థితి ఏంటి భయ్యా?

నందమూరి బాలకృష్ణ( Nandamuri Balakrishna ) హీరోగా అనిల్ రావిపూడి దర్శకత్వం లో రూపొంది మొన్న దసరా కి ప్రేక్షకుల ముందుకు వచ్చిన చిత్రం భగవంత్ కేసరి.

ఆ సినిమా వసూళ్ల విషయం లో బాలయ్య మరో సారి సత్తా చాటాడు.

మొదటి వారం రోజుల్లోనే ఏకంగా 100 కోట్ల రూపాయల వసూళ్లను దక్కించుకున్న బాలయ్య రెండో వారం లో కూడా కుమ్మేస్తున్నాడు.ప్రస్తుతం బాలయ్య సినిమా కు పోటీగా మరే పెద్ద సినిమా కూడా లేకపోవడం తో సినిమా వెళ్లాలి అనుకునే వారికి అదే దారి అన్నట్లుగా పరిస్థితి ఉంది.

అందుకే బాలయ్య భగవంత్ కేసరి( Bhagwant Kesari ) రెండో వారం లో ఇప్పటి వరకు దాదాపుగా 20 కోట్ల రూపాయల గ్రాస్ కలెక్షన్స్ ను నమోదు చేసిందనే వార్తలు వస్తున్నాయి.విశ్వసనీయంగా అందుతున్న సమాచారం ప్రకారం ఈ సినిమా షూటింగ్‌ సమయంలోనే బాలయ్య మరియు అనిల్‌ రావిపూడి ఈ రేంజ్ లో వసూళ్లు నమోదు అవుతాయి అని భావించారట.

అందుకే ఖర్చుకు వెనక్కి తగ్గకుండా భారీగా ఖర్చు చేశారు.ఇప్పుడు సినిమా కోసం నిర్మాతలు పెట్టిన మొత్తం తో పోల్చితే దాదాపుగా రెట్టింపు లాభం ను దక్కించుకున్నారట.లాభాల్లో బాలయ్య కు వాటా ద్వారా దాదాపుగా పారితోషికం కంటే ఎక్కువగా అందిందట.

Advertisement

అందుకే బాలయ్య తో సినిమా కు నిర్మాతలు పెద్ద ఎత్తున ఆసక్తి చూపిస్తున్నారు.ఈ విషయం లో ప్రస్తుతం క్లారిటీ వచ్చే అవకాశాలు ఉన్నాయి.బాబీ ( Bobby )దర్శకత్వం లో ప్రస్తుతం బాలయ్య సినిమా రూపొందుతోంది.

ఆ తర్వాత బోయపాటి మూవీ దర్శకత్వం లో ఒక సినిమాను చేసే అవకాశాలు ఉన్నాయి.మొత్తానికి బాలయ్య తో మంచి సినిమా చేస్తే కచ్చితంగా అభిమానులతో పాటు ప్రేక్షకులు ఆధరిస్తారు అంటూ తేలిపోయింది.

ముందు ముందు కూడా బాలయ్య ఇదే రేంజ్ లో భారీ వసూళ్లు సొంతం చేసుకునే అవకాశాలు ఉన్నాయి.

ఇంట్లోనే సూపర్ సిల్కీ హెయిర్ ను పొందాలనుకుంటే ఇలా చేయండి!
Advertisement

తాజా వార్తలు