పవన్ ని మూడు పెళ్లిళ్ల గురించి అడిగిన బాలయ్య.. ఈ గొడవేంటి భయ్యా అంటూ?

టాలీవుడ్ హీరో బాలకృష్ణ హోస్ట్ గా వ్యవహరిస్తున్న షో అన్ స్టాపబుల్.

ఈ షోలో ఇప్పటికే ఎంతమంది రాజకీయ నాయకులు స్టార్ డైరెక్టర్లు హీరోలు పాల్గొన్న విషయం తెలిసిందే.

ఈ క్రమంలోనే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కూడా ఈ షోకి హాజరయ్యారు.ఈ ఎపిసోడ్ కోసం అభిమానులు ఎంతో ఆత్రుతగా ఎదురుచూస్తున్న విషయం తెలిసిందే.

కాగా పవన్ కళ్యాణ్ అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న అన్ స్టాపబుల్ షో పవన్ కళ్యాణ్ ఎపిసోడ్ కి సంబంధించిన ప్రోమో విడుదల అయ్యింది.పవన్ కళ్యాణ్ కి సంబంధించిన ఎపిసోడ్ మొదటి భాగాన్ని ఫిబ్రవరి 3 నుంచి స్ట్రీమింగ్ చేస్తున్నట్లు ఆహా వెల్లడించిన విషయం తెలిసిందే.

అయితే తాజాగా ఇందుకు సంబంధించిన పార్ట్ 1 ప్రోమోను విడుదల ఆహా.ఆ ప్రోమోలో పవన్ కళ్యాణ్ గ్రాండ్ ఎంట్రీతో ఎపిసోడ్ ప్రారంభం అయ్యింది.అప్పుడు బాలకృష్ణ పవన్ ను ఉద్దేశించి ఈశ్వరా పవనేశ్వరా అంటూ జపించారు.

Advertisement

అప్పుడు పవన్.నేను మీకు తెలుసు, నా స్థానం మీ మనసు అంటూ డైలాగ్ ని చెప్పడంతో బాలకృష్ణ ఓ అంటూ అరిచారు.

తరువాత గుడుంబా శంకర్ ప్యాంట్ గురించి ప్రస్తావించారు.ఆ తర్వాత పవన్ బాలయ్య మొట్టమొదటిసారిగా ఇద్దరూ కలిసిన సందర్భం గురించి గురించి మాట్లాడుకున్నారు.బాలయ్య బాబు పవన్ ని ప్రశ్నలు అడిగేశారు.

తివిక్రమ్ తో స్నేహం, రామ్ చరణ్ తో సాన్నిహిత్యం ఎలా కుదిరిందని ప్రశ్నించారు.దానికి పవన్ తనదైన శైలిలో సమాధానం చెప్పారు.

తరువాత పవన్ కళ్యాణ్ పెళ్లిళ్ల ప్రస్తావన తీసుకొచ్చారు.డైరెక్ట్ గా పవన్ కళ్యాణ్ ను పెళ్లిళ్ల గురించి అడుగుతూ.ఈ పెళ్లిళ్ల గొడవేంటి భయ్యా అంటూ బాలకృష్ణ పవన్ ని ప్రశ్నించగా వాళ్ళు బాధపడతారేమో అని చెప్పి.

Marathon: Atención Al Cliente Y Calidad Del Servicio — Guía Práctica Para Jugadores De Arg...
Felix Spin — Die Besten Spiele Und Slots Im Vergleich

విజ్ఞత, సంస్కారం మాట్లాడకుండా ఆపేస్తున్నాయి అని తెలిపారు పవన్.అలా మొత్తంగా తాజాగా విడుదల చేసిన ప్రోమోలో పవన్ 3 పెళ్లిళ్ల ప్రస్తావన మాత్రం బాగా హైలైట్ అయ్యింది.3 పెళ్లిళ్లు చేసుకున్నాడు అని విమర్శించే వాళ్లకి ఈ ఎపిసోడ్ తో పవన్ కళ్యాణ్ సమాధానం చెప్తారు అన్న క్యూరియాసిటీ అభిమానుల్లో పెరిగిపోతోంది.ఇందుకు సంబంధించిన పూర్తి ఎపిసోడ్ చూడాలంటే ఫిబ్రవరి 3 వరకు వేచి చూడాల్సిందే మరి.

Advertisement