బాలయ్య, అనిల్ రావిపూడి సినిమాకు సర్వం సిద్ధం.. సెట్స్ పైకి వెళ్లేందుకు ప్లాన్!

నందమూరి బాలకృష్ణ బోయపాటి శ్రీను దరకత్వంలో చేసిన అఖండ సినిమా ఇటీవలే రిలీజ్ అయ్యి అఖండమైన విజయం అందుకుంది.

ఈ సినిమాతో పాత రికార్డులను కూడా చెరిపేసి సరికొత్త రికార్డులను క్రియేట్ చేసారు.

ఇక ఈ సినిమా తర్వాత బాలయ్య స్పీడ్ గా సినిమాలు చేస్తున్నాడు.ఇప్పటికే గోపీచంద్ మలినేని దర్శకత్వంలో తన 107వ సినిమాను స్టార్ట్ చేసాడు.

 ఈ సినిమాలో శృతి హాసన్ హీరోయిన్ గా నటిస్తుంది.ఇటీవలే ఈ సినిమా షూటింగ్ స్టార్ట్ చేసి ఫస్ట్ షెడ్యూల్ కూడా పూర్తి చేసారు.

ప్రెసెంట్ ఈ సినిమా సెకండ్ షెడ్యూల్ లో కీలక సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారు.ఇక ఈ సినిమా తర్వాత బాలయ్య అనిల్ రావిపూడి దర్శకత్వంలో ఒక సినిమా చేయ బోతున్నాడు.

Advertisement

సక్సెస్ ఫుల్ డైరెక్టర్ గా పేరు తెచ్చుకున్న అనిల్ రావిపూడి ఫుల్ ఫామ్ లో ఉన్నాడు.ప్రెసెంట్ అనిల్ రావిపూడి ఎఫ్ 3 సినిమా చేస్తున్న విషయం తెలిసిందే.

ఈ సినిమా ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకుని రిలీజ్ కూడా రెడీగా ఉంది.

తాజాగా వస్తున్న సమాచారం ప్రకారం ఈ సినిమా సెట్స్ మీదకు వెళ్లేందుకు రెడీ అవుతున్నట్టు తెలుస్తుంది.ఇప్పటికే అనిల్ బాలయ్య కే తగిన స్క్రిప్ట్ రెడీ చేశారట.ఇంతకు ముందే వీరి కాంబోలో సినిమా రావాల్సి ఉండగా అప్పుడు సెట్ కాలేదు.

అప్పుడు బాలయ్యకు వినిపించిన కథను కొద్దిగా మార్పులు చేసి ఇప్పుడు అదే కథ వినిపించగా ఓకే చెప్పాడట.ఈ సినిమా బాలయ్య కెరీర్ లో 108వ సినిమాగా తెరకెక్కుతుంది.

లైంగిక శ‌క్తిని దెబ్బ‌తీసే ఈ ఆహారాల‌తో జ‌ర జాగ్ర‌త్త‌!

ఈ సినిమాను వినాయక చవితికి స్టార్ట్ చేసి ఈ ఏడాది చివరికల్లా పూర్తి చేసి 2023 సంక్రాంతి బరిలో దించడానికి అన్ని ఏర్పాట్లు చేస్తున్నారని టాక్.ఇక ఈ సినిమాకు సంబంధించిన అధికారిక ప్రకటన జూన్ 10న బాలయ్య పుట్టిన రోజు నాడు ప్రకటించనున్నారట.ఈ సినిమాలో అనిల్ రావిపూడి ఆస్థాన భామలు తమన్నా, మెహ్రీన్ లు హీరోయిన్ లుగా నటిస్తుండగా.

Advertisement

షైన్ స్క్రీన్ పతాకంపై సాహు గారపాటి, హరీష్ పెద్ది నిర్మించనున్నారు.

తాజా వార్తలు