అఫీషియల్.. బాలయ్య అనిల్ మూవీ టైటిల్ ఇదే.. ఐ డోంట్ కేర్ అంటూ?

బాలయ్య అనిల్ రావిపూడి( Anil Ravipudi ) కాంబో మూవీ టైటిల్ కు సంబంధించి ఎన్నో పేర్లు ప్రచారంలోకి వచ్చాయి.

అయితే గత కొన్ని రోజులుగా బాలయ్య అనిల్ కాంబో మూవీకి భగవంత్ కేసరి అనే టైటిల్ వినిపించగా మేకర్స్ ఇదే టైటిల్ ను ఫైనల్ చేశారు.

బాలయ్య( Balayya ) పుట్టినరోజు సందర్భంగా ఈ టైటిల్ కు సంబంధించి అధికారిక ప్రకటన వెలువడింది.ఐ డోంట్ కేర్ అనే ట్యాగ్ లైన్ తో ఉన్న పోస్టర్ ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంటోంది.

"గిప్పడి సంది ఖేల్ అలగ్ ?" అనే క్యాప్షన్ తో అనిల్ రావిపూడి సోషల్ మీడియాలో బాలయ్య మూవీ టైటిల్ పోస్టర్ ను షేర్ చేశారు.కాజల్, శ్రీలీల ( Kajal, Srileela )కీలక పాత్రల్లో నటిస్తున్న ఈ సినిమా ఫ్యాన్స్ ను కచ్చితంగా ఆకట్టుకుంటుందని కామెంట్లు వినిపిస్తున్నాయి.

దసరా కానుకగా ఈ సినిమా రిలీజ్ కానుండగా రిలీజ్ డేట్ కు సంబంధించి అధికారిక ప్రకటన మాత్రం రాలేదు.

Balakrishna Anil Ravipudi Combo Movie Title Fixed Details Here , Balakrishna,
Advertisement
Balakrishna Anil Ravipudi Combo Movie Title Fixed Details Here , Balakrishna,

టైటిల్ సూపర్ గా ఉందని బాలయ్య ఫ్యాన్స్ నుంచి కామెంట్లు వ్యక్తమవుతున్నాయి.బాలయ్య పాత్రను పవర్ ఫుల్ గా చూపించాలని ఫ్యాన్స్ భావిస్తున్నారు.ఈ మధ్య కాలంలో డ్యూయల్ రోల్ సినిమాలలో ఎక్కువగా నటించిన బాలయ్య ఈ సినిమాలో మాత్రం సింగిల్ రోల్ లో కనిపించనున్నారని సమాచారం అందుతోంది.

థమన్ ఈ సినిమాకు మ్యూజిక్ అందిస్తున్నారు.

Balakrishna Anil Ravipudi Combo Movie Title Fixed Details Here , Balakrishna,

వరుసగా బాలయ్య సినిమాలకు థమన్ మ్యూజిక్ డైరెక్టర్ గా ఎంపికవుతున్నారు.థమన్ తో మంచి అనుబంధం ఉండటంతో బాలయ్య సైతం థమన్ కు ఎక్కువగా ప్రాధాన్యత ఇస్తున్నారు.బాలయ్య అనిల్ రావిపూడి కాంబో మూవీ బాక్సాఫీస్ వద్ద నయా రికార్డులు క్రియేట్ చేయనుందని ఫ్యాన్స్ చెబుతున్నారు.

స్టార్ హీరో బాలయ్యకు వరుసగా మరిన్ని విజయాలు దక్కాలని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు.

వారంలో 2 సార్లు ఈ రెమెడీని ట్రై చేస్తే మెడ న‌లుపు మాయం!
Advertisement

తాజా వార్తలు