Balakrishna anil ravipudi : బాలయ్య 'ఎఫ్‌2' ప్రారంభం అయ్యేది ఎప్పుడో క్లారిటీ వచ్చేసింది

నందమూరి బాలకృష్ణ గత సంవత్సరం చివరిలో ప్రేక్షకుల ముందుకు అఖండ సినిమా తో వచ్చిన విషయం తెలిసిందే.

ఆ సినిమా భారీ విజయాన్ని సొంతం చేసుకున్న నేపథ్యం లో వెంటనే గోపీచంద్ మలినేని దర్శకత్వం లో ఒక సినిమా ను మొదలు పెట్టాడు.

ఆ సినిమా పూర్తి కాకుండానే అనిల్ రావిపూడి దర్శకత్వం లో మరో సినిమా కి కూడా కమిట్ అయ్యాడు.వీరిద్దరి కాంబినేషన్ లో సినిమా కు సంబంధించిన షూటింగ్ కార్యక్రమాలు ఎప్పుడెప్పుడు ప్రారంభం అవుతాయా అంటూ నందమూరి అభిమానులతో పాటు ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.

అనిల్ రావిపూడి కెరియర్ మొత్తం మాస్ మసాలా ఎంటర్టైన్మెంట్స్ తో ప్రేక్షకులను అలరించాడు.అలరిస్తాడని నమ్మకమును కలిగించాడు.

ఎఫ్‌ 2 మరియు ఎఫ్‌ 3 సినిమా లతో తెలుగు లో భారీ కమర్షియల్‌ సక్సెస్‌ లను కామెడీ ఎంటర్ టైనర్స్ గా రూపొందించి సక్సెస్ లను దక్కించుకున్నాడు.కనుక భారీ అంచనాల నడుమ రూపొందబోతున్న బాలకృష్ణ అనిల్ రావిపూడి కాంబినేషన్ సినిమా మరో సూపర్ హిట్ అవుతుందని నమ్మకాన్ని ప్రేక్షకులు వ్యక్తం చేస్తున్నారు.

Advertisement

ఈ సినిమా ఎప్పుడెప్పుడు ప్రారంభం అవుతుందా అంటూ అంతా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.ఎట్టకేలకు షూటింగ్‌ ప్రారంభం కాబోతున్నట్లుగా చిత్ర యూనిట్‌ సభ్యులు అధికారికంగా ప్రకటించారు.

వచ్చే నెల 8వ తారీకు నుండి ఈ సినిమా షూటింగ్ కార్యక్రమంలో ప్రారంభించబోతున్నట్లుగా తెలుస్తోంది.పది రోజుల పాటు చిత్రీకరణ జరిపేందుకు దర్శకుడు అనిల్ రావిపూడి ప్రీ ప్రొడక్షన్‌ వర్క్ రెడీ చేశాడనే వార్తలు వస్తున్నాయి.గోపీచంద్ మలినేని సినిమా షూటింగ్ కార్యక్రమాలు పూర్తి కాకుండానే అనిల్ రావిపూడి సినిమా యొక్క షూటింగ్ కార్యక్రమాలు మొదలు పెట్టబోతున్నారట.

అనిల్ రావిపూడి సినిమా మొదటి షెడ్యూల్‌ పూర్తి అయిన తర్వాత మళ్లీ గోపిచంద్ మలినేని సినిమా షూటింగ్ కి బాలయ్య డేట్లు ఇచ్చాడట.ఆ షెడ్యూల్‌ తో సినిమా మొత్తం పూర్తి అవ్వబోతుంది.

jamuna, Relangi : రేలంగి మాటలకు హీరోయిన్ జమున జంప్..కారణం ఏంటి ?
Advertisement

తాజా వార్తలు