బలగం సినిమాతో దిల్ రాజుకు అలా కూడా డబ్బులే డబ్బులు

ఇటీవల తెలుగు ప్రేక్షకులకు బాగా దగ్గరైన చిత్రం.నచ్చిన చిత్రం.

భారీ కలెక్షన్స్ నమోదు చేసిన చిత్రం బలగం( balagam ).

కమెడియన్ వేణు దర్శకత్వం లో దిల్ రాజు( Dilraju ) నిర్మించిన ఈ చిత్రం లో ప్రియదర్శి హీరో గా నటించాడు.తెలంగాణ పల్లెలోని ఒక కుటుంబం నేపథ్యం లో రూపొందిన ఈ చిత్రం ఎమోషనల్ గా ప్రతి ఒక్కరికి కనెక్ట్ అవుతుంది.

థియేటర్ లలో విడుదలైన ఈ సినిమా మూడు వారాల్లోనే ఓటీటీ ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చిన విషయం తెలిసిందే.ఒక వైపు థియేటర్ లో ఆడుతూనే మరో వైపు ఓటీటీ( OTT ) లో కూడా ఈ సినిమా సందడి చేస్తున్న విషయం తెల్సిందే.

థియేటర్ రిలీజ్ అయ్యి భారీ గా కలెక్షన్స్ నమోదు చేసిన ఈ చిత్రం అమెజాన్ ప్రైమ్‌ ద్వారా కూడా నిర్మాత దిల్ రాజుకి లాభాలను తెచ్చిపెడుతుందట.

Advertisement

ప్రైమ్‌ లో వ్యూస్ అనుసారంగా దిల్ రాజు కు డబ్బులు వస్తాయట.ప్రస్తుతం అమెజాన్ ప్రైమ్ ( Amazon Prime )లో బలగం చిత్రాన్ని చాలా మంది చూస్తున్నారు.కనుక ప్రైమ్ ద్వారా కూడా దిల్ రాజు కి పెద్ద మొత్తంలో డబ్బులు వస్తున్నట్లుగా సమాచారం అందుతుంది.

బలగం సినిమా ఇది మన సినిమా అన్నట్లుగా తెలంగాణ ప్రేక్షకుల తో పాటు తెలుగు ప్రేక్షకులంతా కూడా ఆసక్తిగా చూస్తున్నారు.అసలు ఈ సినిమా లో మ్యాటర్ ఏంటి అంటూ కొందరు చూస్తున్నారు.

క్లైమాక్స్ లో వచ్చే పాట మరియు కొన్ని సన్నివేశాలు మనసుకు హత్తుకునే సన్నివేశాలు సినిమా స్థాయి ని పెంచాయి అనడంలో సందేహం లేదు.బలగం చిత్రం ఒక అద్భుతం అంటూ ఇండస్ట్రీకి చెందిన ప్రముఖులు కూడా అభిప్రాయం వ్యక్తం చేశారు.

కనుక ఈ సినిమా మీడియా లో ఎక్కువగా ప్రచారం జరిగింది.అందుకే ఎక్కువ కలెక్షన్స్ నమోదు చేయడం తో పాటు ఇప్పుడు అమెజాన్ ప్రైమ్ లో కూడా ఎక్కువ మంది చూస్తున్న సినిమాగా నిలిచింది.

ఇంట్లోనే సూపర్ సిల్కీ హెయిర్ ను పొందాలనుకుంటే ఇలా చేయండి!
Advertisement

తాజా వార్తలు