Ramya Krishna : బాహుబలి కి నా డైలాగ్స్ చూసి రమ్య కృష్ణ కింద పడి పడి నవ్వింది

బాహుబలి( Bahubali ).ఈ సినిమా రెండు భాగాలు కూడా విడుదలై దాదాపు 7, 8 ఏళ్ల సమయం గడిచిపోయింది.

అయినా కూడా ఈ సినిమాకు సంబంధించి ఇప్పటికి ఏదో ఒక వార్త సోషల్ మీడియాలో నానుతూ ఉంటుంది.ఆ సినిమాలో నటించిన నటీనటులు కానీ, ఆ కిలికిలి భాష కానీ ఏదో ఒక రకంగా మీడియాలో వైరల్ గానే ఉంటాయి.

అయితే ఇటీవల బాహుబలి సినిమా ద్వారా బాగా గుర్తింపు పొందిన నటుడు ప్రభాకర్( Actor Prabhakar ) ఒక మీడియా ఛానల్ కి ఇంటర్వ్యూ ఇచ్చాడు.బాహుబలి సినిమా షూటింగ్ టైం లో జరిగిన అనేక విషయాలను ఈ ఇంటర్వ్యూలో పంచుకున్నాడు అవేంటో ఓసారి చూద్దాం పదండి.

Bahubali Prabhakar About Ramyakrishna

బాహుబలి సినిమా టైంలో భయంకరమైన రూపంలో కనిపించిన ప్రభాకర్ మీకు అందరికీ గుర్తుండే ఉంటాడు.నటన అద్భుతంగా వచ్చి చక్కగా డైలాగ్స్ పలకగలిగే నటుడు దొరికితే ఎలాంటి అద్భుతాలు జరుగుతాయో ప్రభాకర్ ని చూస్తే అర్ధం అవుతుంది.ఈ సినిమాలో తనదైన రీతిలో కిలికిలి భాషలో డైలాగ్స్ పలికి అందరి చేత మంచి నటుడుగా ప్రశంసలు దక్కించుకున్నాడు అయితే ప్రభాకర్ కిలికిలి భాష మాట్లాడుతున్న సమయంలో తనకు ఎదురుగా ఉన్న రమ్యకృష్ణ పడి పడి నవ్వుతూ ఉండేవారట.

Bahubali Prabhakar About Ramyakrishna
Advertisement
Bahubali Prabhakar About Ramyakrishna-Ramya Krishna : బాహుబలి క

ఆమె ఎంతలా నవ్వే వారంటే ఆమె చుట్టూ ఉన్న గడ్డి మొత్తం షూటింగ్ కోసం తీసుకొచ్చింది కాబట్టి ఒక అడుగు అటువేసిన లేదా ఇటు వేసిన ఆ గడ్డి విరిగిపోతుంది.అందుకని కాస్త కూడా కదలకుండా నిలుచుకోవాల్సిన పరిస్థితి.కానీ ప్రభాకర్ డైలాగ్స్ చెప్తుంటే రమ్యకృష్ణ తనని తాను కంట్రోల్ చేసుకోలేకపోయే వారట.

యాక్షన్ అని చెప్పగానే ప్రతి డైలాగ్ కి రమ్యకృష్ణ నవ్వడం వల్ల తనకు ఎంతగానో ఇబ్బంది కలిగిందని, తాను తన యాక్టింగ్ పై దృష్టి పెట్టలేకపోయానని కానీ అది చాలా సరదాగా ఉండేదని ఆ సన్నివేశం నాకు ఇప్పటికీ కళ్ళ ముందు కదులుతుందని రమ్యకృష్ణ( Ramya Krishna ) ఇంత డౌన్ టు ఎర్త్ ఉంటారని అస్సలు ఊహించలేదని అంత పెద్ద స్టార్ హీరోయిన్ అయినా కూడా ఆ తమతో పాటే చాలా సాధారణంగా ఉండేవారు అంటూ రమ్యకృష్ణ గురించి ప్రభాకర్ చాల సరదాగా తెలిపాడు.

Advertisement

తాజా వార్తలు