అల్లు అర్జున్ తో ఫస్ట్ సినిమా చేస్తే హీరోయిన్ కెరియర్ క్లోజ్...

గౌరీ ముంజాల్.( Gowri Munjal ) ఈ బ్యూటీ గురించి ప్ర‌త్యేక‌మైన ప‌రిచ‌యాలు అవ‌స‌రం లేదు.

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్( Allu Arjun ) హీరోగా తెర‌కెక్కిన `బ‌న్నీ`( Bunny Movie ) మూవీతోనే గౌరీ సినీ రంగ ప్ర‌వేశం చేసింది.వి.

వి.వినాయక్ ద‌ర్శ‌క‌త్వం వ‌హించిన ఈ ల‌వ్ అండ్ యాక్ష‌న్ ఎంట‌ర్టైన‌ర్ 2008లో విడుద‌లై బాక్సాఫీస్ వ‌ద్ద ఘ‌న విజ‌యం సాధించింది.తొలి సినిమాతోనే అందం, అభిన‌యం మ‌రియు న‌ట‌నా ప్ర‌తిభ‌తో గౌరీ తెలుగు ప్రేక్ష‌కుల‌ను విశేషంగా ఆక‌ట్టుకుంది.

బ‌న్నీ చూశాక చాలా మంది గౌరీ ముంజాల్ స్టార్ హీరోయిన్ అవుతుంద‌ని అనుకున్నారు.కానీ, అలా జ‌ర‌గ‌లేదు.బ‌న్నీ వంటి బ్లాక్ బ‌స్ట‌ర్ హిట్ అనంత‌రం గౌరీ తెలుగులో శ్రీ కృష్ణ, గోపి, భూకైలాస్, కౌసల్యా సుప్రజా రామ, బంగారుబాబు వంటి చిత్రాల్లో న‌టించింది.

Advertisement

అలాగే క‌న్న‌డ‌, మ‌ల‌యాళ భాష‌ల్లోనూ న‌టించింది.అయితే క‌థ‌ల ఎంపికలో చేసిన పొర‌పాట్లు కార‌ణంగా గౌరీకు స‌రైన హిట్ ప‌డలేదు.

అయితే ఆమెకి ఇండస్ట్రీ లో సక్సెస్ రేటు లేక‌పోవ‌డం, కొత్త హీరోయిన్ల పోటీ వ‌ల్ల త‌క్కువ స‌మ‌యంలో గౌరీ ముంజాల్ ఫేడౌట్ హీరోయిన్ల లిస్ట్ లో చేరిపోయింది.అయితే గౌరీ ఇప్పుడు ఎక్క‌డ ఉంది.

ఏం చేస్తుంది.అన్న విష‌యాలు చాలా మందికి తెలియ‌దు.

ప్ర‌స్తుతం గౌరీ ముంజాల్ ఫ్యామిలీతో క‌లిసి ఢిల్లీలో ఉంటోంది.అక్క‌డే స్థిర‌ప‌డ్డ ఈ అందాల సోయ‌గం.

తెలుగు రాశి ఫలాలు, పంచాంగం - జూన్ 5, ఆదివారం, జ్యేష్ఠ మాసం , 2022

సినిమా ఆఫ‌ర్లు( Movie Offers ) రాక‌పోవ‌డం వ‌ల్ల ఏవో వ్యాపారాలు చూసుకుంటుంది.

Advertisement

అయితే గౌరీ ముంజాల్ కు ఇంత వ‌ర‌కు పెళ్లి కాలేదు.వ‌య‌సు 40కి చేరువైనా ఆమె వైవాహిక జీవితంలోకి అడుగు పెట్ట‌పోవ‌డం గమనార్హం.ఇక హీరోయిన్లు సినిమాల‌కు దూర‌మైతే గుర్తు ప‌ట్ట‌లేనంత‌గా మారిపోతుంది.

కానీ, గౌరీ ముంజాల్ మాత్రం ఇప్ప‌టికీ త‌న గ్లామ‌ర్ ను చ‌క్క‌గా మెయింటైన్ చేస్తోంది.అలాగే ఫిజిక్ ను బాగానే కాపాడుకుంటూ వ‌చ్చింది.

ఒక‌వేళ ఈమె సెకండ్స్ ఇన్నింగ్స్( Second Innings ) స్టార్ట్ చేస్తే స‌హాయ‌క పాత్ర‌ల‌కు చ‌క్క‌ని ఎంపిక అవుతుంది.మ‌రి గౌరీకి ఆ ఉద్దేశం ఉందో లేదో తెలియాల్సి ఉంది.

ఇలాగే ఈమె తో పాటు అల్లు అర్జున్ తో ఆర్య సినిమా లో( Arya Movie ) నటించిన హీరోయిన్ అయిన అను మెహతా( Anu Mehta ) కూడా ఇండస్ట్రీ నుంచి దూరం అయింపోయింది.సుకుమార్ డైరెక్షన్ లో అల్లు అర్జున్ హీరోగా వచ్చిన ఈ మూవీ బాక్స్ ఆఫీస్ వద్ద భారీ హిట్ అయింది అయిన కూడా అను కి పెద్దగా ఆఫర్స్ రాలేదు అల్లరి నరేష్ తో నువ్వంటే నాకిష్టం అనే సినిమా లో నటించినప్పటికీ ఆ తర్వాత ఆమె ఎక్కడ కనిపించలేదు.

ఇక అలాగే గుణశేఖర్ డైరెక్షన్ లో అల్లు అర్జున్ హీరోగా వచ్చిన వరుడు సినిమాలో హీరోయిన్ గా చేసిన భాను మెహ్రా( Bhanu Mehra ) కూడా ఆ తర్వాత ఒకటి రెండు సినిమాల్లో కనిపించిన పెద్ద ప్రయోజనం లేకుండా పోయింది ఇక దాంతో ఆమె ఇప్పుడు ఇండస్ట్రీ నుంచి దూరం అయిపోయింది.ఇండస్ట్రీ లో అల్లు అర్జున్ ఏదైనా కొత్త హీరోయిన్ తో చేస్తున్నాడు అంటే ఆమె కి ఇండస్ట్రీ లో తర్వాత అవకాశాలు రావు అనే చెప్పాలి.

తాజా వార్తలు