'బేబీ' సినిమా డబ్బింగ్ కార్యక్రమాలు ప్రారంభం

యువ హీరో ఆనంద్ దేవరకొండ నటిస్తున్న కొత్త సినిమా బేబీ.

ఈ చిత్రాన్ని మాస్ మూవీ మేకర్స్ పతాకంపై ఎస్ కే ఎన్, దర్శకుడు మారుతి సంయుక్తంగా నిర్మిస్తున్నారు.

సాయి రాజేష్ దర్శకత్వం వహిస్తున్నారు.విరాజ్ అశ్విన్,వైష్ణవి చైతన్య ఇతర కీలక పాత్రల్లో నటిస్తున్నారు.

తాజాగా ఈ సినిమా డబ్బింగ్ కార్యక్రమాలు ప్రారంభమయ్యాయి.న్యూ ఏజ్ లవ్ స్టొరీ గా తెరకెక్కుతున్న బేబీ మూవీ చిత్రీకరణ తుది దశలో ఉంది.

పోస్ట్ ప్రొడక్షన్ పనులు కూడా మొదలు పెట్టారు.త్వరలో సినిమా విడుదలకు దర్శకనిర్మాతలు సన్నాహాలు చేస్తున్నారు.

Advertisement

నిర్మాత: ఎస్.కే.ఎన్, నిర్మాణ సంస్థ : మాస్ మూవీ మేకర్స్, రచన, దర్శకత్వం: సాయి రాజేష్, సినిమాటోగ్రఫీ: బాల్ రెడ్డి, సంగీతం: విజయ్ బుల్గానిన్,ఎడిటింగ్: ఎం.ఆర్ వర్మ, ఆర్ట్: సురేష్, సహా నిర్మాత: ధీరజ్ మోగిలినేని, ఎగ్జిక్యూటివ్ నిర్మాత: దాసరి వెంకట సతీష్, చీఫ్ సహాయ దర్శకుడు: మహేష్ అలంశెట్టి, పీఆర్వో: ఏలూరు శీను & జి.ఎస్.కే మీడియా, కొరియోగ్రఫీ:పొలాకి విజయ్.

ఐపీల్ పేరుతో విధ్వంసం...ఇదంతా స్వయంకృపరాధమే.. ఇంకా ఎన్ని చూడాలో !
Advertisement

తాజా వార్తలు