చిరంజీవి మగాడు.. అదే నా బలహీనత.. బాబు మోహన్ కామెంట్స్ వైరల్!

ప్రముఖ టాలీవుడ్ నటులలో ఒకరైన బాబు మోహన్ ఒక ఇంటర్య్వూలో మాట్లాడుతూ ఆసక్తికర విషయాలను వెల్లడించారు.

నాన్న మొదట టీచర్ గా తర్వాత ఆర్ అండ్ బీలో ఉద్యోగం చేశారని బాబు మోహన్ తెలిపారు.

అమ్మ లేదని ఎప్పుడూ బాధపడుతూ ఉండేవాడినని బాబు మోహన్ తెలిపారు.అమ్మ గుర్తొస్తే నాకు ఏడుపు వచ్చేదని బాబు మోహన్ కామెంట్లు చేశారు.

కడుపుకోతను నేను మరిచిపోలేనని బాబు మోహన్ తెలిపారు.కోట్ల సంఖ్యలో ప్రజలను నవ్వించిన మాకు దేవుడు ఇలాంటి శిక్ష విధించారని ఆయన అన్నారు.

మేము ఎదిగిన ఎదుగుడు మామూలు ఎదుగుడు కాదని ఆయన తెలిపారు.నేను డ్యాన్స్ వేస్తే సినిమాలు 100 రోజులు ఆడాయని నేనేమైనా చిరంజీవి గారినా డ్యాన్స్ వేయడానికి అంటూ బాబు మోహన్ కామెంట్లు చేశారు.

Advertisement

చిరంజీవి గారు ఒక మగాడు రబ్బరు తిరిగినట్టు డ్యాన్స్ స్టెప్పులు వేస్తారని బాబు మోహన్ చెప్పుకొచ్చారు.చిరంజీవి డ్యాన్స్ టీవీలో వస్తుంటే కళ్లు ఆకాశమంత చేస్తానని బాబు మోహన్ చెప్పుకొచ్చారు.

చిరంజీవి రాధ, రాధిక, భానుప్రియ, విజయశాంతిలో అదిరిపోయే డ్యాన్స్ స్టెప్పులు వేశారని బాబు మోహన్ కామెంట్లు చేశారు.నేను తప్పును సహించనని అదే నా బలహీనత అని ఆయన చెప్పుకొచ్చారు.అబద్ధాన్ని, మంది సొమ్ము తినడాన్ని నేను సహించనని ఇవే నా బలహీనతలు అని ఆయన వెల్లడించారు.

కెరీర్ తొలినాళ్లలో కామెడీ విలన్ రోల్స్ లో ఎక్కువగా నటించానని బాబు మోహన్ తెలిపారు.కష్టపడే వాళ్లకు డబ్బు విలువ తెలుస్తుందని బాబు మోహన్ చెప్పుకొచ్చారు.ఆల్బమ్ పట్టుకుని నేను ఎక్కడా తిరగలేదని బాబు మోహన్ చెప్పుకొచ్చారు.

నేను గోడౌన్ ఇన్ ఛార్జ్ గా అప్పట్లో పని చేసేవాడినని ఆయన వెల్లడించారు.నేను లీవ్ పెట్టకపోతే సస్పెండ్ చేసేవారని ఆయన తెలిపారు.

మీరు 11 వ తారీఖున జన్మించారా....అయితే మీ లక్షణాలు ఎలా ఉంటాయో తెలుసా?
Advertisement

తాజా వార్తలు