ఢిల్లీ లో బాబు బిజీ బిజీ.. వీరందరితోనూ భేటీ 

ఢిల్లీ పర్యటనలో ఉన్న టిడిపి(TDP) అధినేత , ఏపీ సీఎం చంద్రబాబు (AP CM Chandrababu)బిజీబిజీగా గడపనున్నారు .

రెండు రోజుల ఢిల్లీ పర్యటన నిమిత్తం నిన్న రాత్రి ఢిల్లీకి చంద్రబాబు (Chandrababu)చేరుకున్నారు.

ఇక ఈ రోజు మాజీ ప్రధాని వాజ్ పాయ్ శత జయంతి ఉత్సవాలలో (PM Vajpayees centenary celebrations)పాల్గొంటారు.వాజ్ పాయ్ సమాధి సైదల్ అటల్ వద్ద చంద్రబాబు నివాళులు అర్పిస్తారు.

  ఈరోజు మధ్యాహ్నం 12:30 గంటలకు బిజెపి జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా (BJP national president JP Nadda)నివాసంలో జరగనున్న ఎన్డీఏ కూటమి పక్షాల నేతల సమావేశానికి చంద్రబాబు హాజరుకానున్నారు.  ఈరోజు సాయంత్రం ప్రధాని నరేంద్ర మోది(Prime Minister Narendra Modi),  అలాగే కేంద్ర హోం మంత్రి అమిత్ షా(Minister Amit Shah) తో విడివిడిగా చంద్రబాబు భేటీ అవుతారు.

ఆ తర్వాత కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మల సీతారామన్(Nirmala Sitharaman),  రైల్వే మంత్రి అశ్విని వైష్ణవితో(Ashwini Vaishnav) భేటీకి సంబంధించిన అంశాల పైన,  పెండింగ్ ప్రాజెక్టుల పైన చర్చించనున్నారు అలాగే ఇటీవల ఏపీ రాజధాని కోసం మంజూరైన రైలు మార్గం పనులను వీలైనంత తొందరగా ప్రారంభించేలా చర్యలు తీసుకోవాలని రైల్వే మంత్రిని  చంద్రబాబు కోరనున్నారు.అమరావతి అభివృద్ధికి ఆర్థికంగా తోడ్పాటు అందించడంతో పాటు,  పెండింగ్ నిధులు విడుదల పైన కేంద్ర ఆర్థిక మంత్రితో చంద్రబాబు చర్చించనున్నారు.

Advertisement

ఎన్డీఏ కూటమిలో టిడిపి కీలక భాగస్వామిగా ఉండడంతో చంద్రబాబుకు బిజెపి పెద్దలు అధికంగా ప్రాధాన్యం ఇస్తున్నారు.చంద్రబాబు కోరిన కోరికలు తీర్చితూ,  ఏపీకి సంబంధించి నిధుల విడుదల , ప్రాజెక్టుల మంజూరు తదితర అంశాలపై కేంద్ర బిజెపి పెద్దలు సానుకూలంగానే స్పందిస్తూ వస్తున్నారు.  ఈ నేపద్యంలోనే ఏపీలో అమరావతి లో అభివృద్ధి పనులు , నిర్మాణ పనులు వేగవంతమయ్యేలా ఎప్పటికప్పుడు కేంద్ర పెద్దల సహకారంతో చంద్రబాబు ప్రయత్నాలు చేస్తూ వస్తున్నారు.

ఇక ఢిల్లీ టూర్ లోను ఏపీకి సంబంధించి అనేక ప్రయోజనాలను పొందేలా కేంద్ర పెద్దల సహకారం తో ఏపీలో అభివృద్ధి పనులు వేగవంతం అయ్యేలా చంద్రబాబు ప్రయత్నాలు చేస్తున్నారు.

Advertisement

తాజా వార్తలు