Babu Antony: బాబు ఆంటోనీ కుటంబ నేపథ్యం ఇదే.. భార్య పిలల్లను చూసారా ?

బాబు ఆంటోనీ( Babu Antony ) అనే పేరు చెప్పగానే అందరికి టక్కున గుర్తచ్చే సినిమా పసివాడి ప్రాణం.

( Pasivadi Pranam ) ఈ సినిమా ద్వారానే బాబు ఆంటోనీ తెలుగు సినిమా ఇండస్ట్రీ కి పరిచయం అయ్యాడు.

వాస్తవానికి బాబు ఆంటోనీ కేరళలో పుట్టి మలయాళ సినిమాల్లో తొలిసారి కనిపించాడు .ఇప్పటికి మలయాళ తమిళ సినిమాల్లోనే నటిస్తున్న బాబు ఆంటోనీ నాటి నుంచి నేటి వరకు సినిమాల్లో బిజీ గానే ఉన్నాడు.1985 లో శత్రు( Shatru ) అనే మలయాళ సినిమా ద్వారా నటన వృత్తిగా మార్చుకున్నాడు.తెలుగు లో బాబు ఆంటోనీ నటించిన చివరి సినిమా బాలకృష్ణ హీరో గా వచ్చిన నిప్పు రవ్వ.

ఇక ఆ తర్వాత కేవలం మలయాళ, తమిళ భాషల్లోనే సినిమాలు తీస్తూ కంటిన్యూ అవుతున్నాడు బాబు ఆంటోనీ.ఇక మొన్నటికి మొన్న పొన్నియన్ సెల్వన్ సినిమాల్లో కనిపించిన బాబు ఆంటోనీ 2022 లో దాదాపు నాలుగు సినిమాల్లో నటించాడు.

ఇక 2023 విషయానికి వచ్చే సరికి ఒక మలయాళ సినిమా, 2 తమిళ సినిమాల్లో నటిస్తున్నాడు.వచ్చే ఏడాదికి కూడా బాబు డేట్స్ బుక్ అవ్వడం విశేషం.ఇక బాబు ఆంటోనీ వ్యక్తి గత జీవితం విషయానికి వస్తే ఆయనకు ఒక భార్య ఇద్దరు కొడుకులు కూడా ఉన్నారు.

Advertisement

భార్య పేరు ఎవ్జెనియా ఆంటోనీ. ఇతడి అన్నయ్య కూడా నటుడే.

అయన పేరు ఆంటోనీ తెక్కెక్.ఇక ఇద్దరు కొడుకులు ఉండగా వారి పేర్లు అలెక్స్ ఆంటోనీ, ఆర్థూర్ ఆంటోనీ.

తనలాగానే పిల్లలను మార్షల్ ఆర్ట్స్ లో ట్రైన్ చేస్తున్నాడు బాబు ఆంటోనీ.ఎందుకంటే బాబు ఆంటోనీ మార్షల్ ఆర్ట్స్( Martial Arts ) నిపుణుడు మరోయు ఐదు సార్లు బ్లాక్ బెల్ట్ సంపాదించుకున్నాడు.

అలాగే పెద్ద కొడుకు ఆర్థూర్ ఆంటోనీ ఇప్పటికే మార్షల్ ఆర్ట్స్ లో బ్లాక్ బెల్ట్ సాధించగా, హీరో గా కూడా చేయాలనీ అనుకుంటున్నాడట.అమెరికన్ పౌరసత్వం కలిగిన బాబు ఆంటోనీ రష్యన్ అమ్మాయిని పెళ్లి చేసుకొని సెటిల్ అవ్వడం విశేషం.ఇక బాబు ఆంటోనీ తన పేరుపై మార్షల్ ఆర్ట్స్ స్కూల్స్ ని కూడా తెరిచాడు.

Joka : Expérience Mobile, Paiements Et Mécanismes De L’ap...
Felix Spin — Die Besten Spiele Und Slots Im Vergleich

ఇండియా తో పాటు మూడు దేశాల్లో ఇతనికి మార్షల్ ఆర్ట్స్ స్కూల్స్ ఉన్నాయ్.ఇక చాల ఏళ్ళ క్రితం తెలుగు సినిమాల్లో నటించడం ఆపేసిన బాబు మళ్లి తిరిగి తెలుగు సినిమా పరిశ్రమలో బిజీ అవ్వాలని కోరుకుందాం.

Advertisement

తాజా వార్తలు