Baahubali vs Devara : దేవర మూవీకి బాహుబలి లింక్.. దేవర పార్ట్1 లో ఆ సీన్స్ ను మాత్రమే చూపిస్తారా?

టాలీవుడ్ దర్శకుడు కొరటాల శివ( Koratala Siva ) దర్శకత్వంలో జూనియర్ ఎన్టీఆర్ హీరోగా నటించిన చిత్రం దేవర.

ఇందులో బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్ హీరోయిన్ గా నటిస్తున్న విషయం తెలిసిందే.

ఈ మూవీని కోట్ల బడ్జెట్ తో అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారు.ఈ మూవీ రెండు పార్ట్ లుగా విడుదల కానుండగా అందులో దేవర పార్ట్ 1( Devara Part 1 ) అక్టోబర్ 10 విడుదలను చేసేందుకు పరుగులు పెడుతోంది.

వినడానికి ఇంకా టైం ఉన్నట్టు అనిపిస్తున్నా చేతిలో ఉన్న ఏడు నెలలు ఇలాంటి ప్యాన్ ఇండియా మూవీస్ కి ఎంత మాత్రం చాలవు.ఏప్రిల్ లో మంచి డేట్ వదులుకోవడం వల్ల ఫ్యాన్స్ లో రేగిన అసంతృప్తిని చల్లార్చేందుకు వేసవి నుంచి పక్కా ప్లానింగ్ తో భారీ ఎత్తున ప్రమోషన్లు మొదలుపెట్టేందుకు టీమ్ రెడీ అవుతోంది.

Baahubali Formula For Devara

త్వరలోనే కొత్త షెడ్యూల్ కోసం గోవా వెళ్ళబోతున్నారు.దేవర తండ్రి కొడుకుల కథగా తారక్( Junior NTR Dual Role ) ని రెండు పాత్రల్లో కొరటాల చూపించబోతున్నారని ఇన్ సైడ్ టాక్.మొదటి భాగంలో కొడుకుకి సంబంధించిన ఘట్టాన్ని ఆవిష్కరించి సీక్వెల్ లో తండ్రి క్యారెక్టర్ ని హై వోల్టేజ్ లో రివీల్ చేస్తారని తెలిసింది.

Advertisement
Baahubali Formula For Devara-Baahubali Vs Devara : దేవర మూవీక

అలా అని వయసు మళ్ళిన వాడిగా జూనియర్ కనిపించడట.బాహుబలి( Baahubali ) లాగే రెండు కాలాల్లో రెండు పాత్రలను చూపించి తద్వారా ఒకదానితో మరొకటి ముడిపెట్టే విధానం ప్రత్యేకంగా ఉంటుందట.

సో మహేంద్ర, అమరేంద్రగా ప్రభాస్ లో చూపించిన ఎలివేషన్ ని మించి దేవరలో జూనియర్ ఎన్టీఆర్( Junior NTR ) రూపంలో చూడొచ్చన్న మాట.

Baahubali Formula For Devara

జాన్వీ కపూర్( Jahnvi Kapoor ) హీరోయిన్ గా పరిచయమవుతున్న దేవర వల్ల ఆమెకు రామ్ చరణ్ సినిమాలోనూ ఛాన్స్ దక్కిందనే టాక్ ఆల్రెడీ ఉంది.సైఫ్ అలీ ఖాన్( Saif Ali Khan ) గాయం నుంచి పూర్తిగా కోలుకోవడంతో ఇప్పుడు గోవాలో తను కూడా పాల్గొనబోతున్నారు.తారక్, జాన్వీల మీద ఒక పాటతో పాటు బీచ్ ఒడ్డున సముద్రానికి సంబంధించిన కొన్ని ముఖ్యమైన ఎపిసోడ్లను షూట్ చేయబోతున్నారు.

అనిరుద్ రవిచందర్ మిగిలిన పాటలకు సంబంధించిన పని పూర్తి చేయగానే వాటి చిత్రీకరణ కూడా కొలిక్కి వస్తుంది.ఈసారి ఎలాంటి పోస్ట్ పోన్ లేకుండా ఖచ్చితంగా విడుదల తేదీని అందుకునేలా ప్లానింగ్ చేసుకున్నారు.

కోపాన్ని అదుపులోకి తెచ్చే బెస్ట్ టిప్స్ మీకోసం?
Advertisement

తాజా వార్తలు