కృష్ణా జిల్లాలో ఘోరం..బీటెక్ విద్యార్ధినిపై అత్యాచారం ..

ఏపీ రాజధాని ప్రధాన జిల్లా అయిన కృష్ణా లోని ఆగిరిపల్లి లో ఘోరం జరిగింది.

బీటెక్‌ మొదటి సంవత్సరం చదువుతున్న విద్యార్థినిపై సీనియర్‌ విద్యార్థులు అత్యాచారానికి పాల్పడిన వెలుగులోకి వచ్చింది ఈ సంఘటన జరిగి మూడేళ్ళు అయ్యింది అయితే తాజాగా జరిగిన ఒక ఘటనతో మళ్ళీ తెరపైకి వచ్చిన విషయం ఇప్పుడు ఏపీ వ్యాప్తంగా సంచలనం అయ్యింది.

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.

2015 ఏడాది ఫిబ్రవరి నెలలో ఓ ఇంజినీరింగ్‌ కళాశాలలో చదువుతున్న ఓ విద్యార్థినిని తన తోటి విద్యార్థి వంశీకృష్ణ తన పుట్టిన రోజు పార్టీ ఇస్తానని చెప్పి మరో సీనియర్‌ శివారెడ్డితో కలిసి ఆగిరిపల్లిలోని ఓ గదికి తీసుకువెళ్లాడు.అయితే పార్టీ అన్నారు గదిలో ఎవరూ లేరు అని ఆమె అడిగేలోగానే ఆమెపై ఇద్దరు వ్యక్తులు అత్యాచారం చేసి ఆ ఘాతుకాన్ని కెమెరాలో భంధించారు.ఈ విషయం ఎవరికైనా చెప్తే ఈ వీడియో ని బహిర్గతం చేస్తామని బెదిరించారు అయితే అప్పటి నుంచీ ఆ విద్యార్ధిని తీవ్రమనో వేదనకి గురవ్వడంతో ఇంట్లో అనుమానం వచ్చిన తల్లి తండ్రులు గట్టిగా అడిగేసరికి అసలు విషయం చెప్పింది.

దీంతో 2018 మే నెలలో కళాశాల యాజమాన్యానికి జరిగిన ఉదంతంపై విద్యార్థిని తండ్రి ఫిర్యాదు చేశారు.దీంతో ఆ విద్యార్థులను కళాశాల యాజమాన్యం మందలించి వదిలేసింది.సమస్య తీరిపోయింది అనుకున్నారు.

Advertisement

అయితే అత్యాచారం చేసిన విద్యార్థి స్నేహితుడు ప్రవీణ్‌ ఇటీవల చరవాణి ద్వారా విద్యార్థినిపై బెదిరింపులకు పాల్పడ్డాడు.ఈ వీడియో తన వద్ద ఉందని రూ.10లక్షలు ఇవ్వాలని లేకపోతే ఆ వీడియోలను బహిర్గతం చేస్తానని బెదిరించాడు.అయితే ఇదే వీడియో గ్రామంలో ఒకరిద్దరి వద్ద ఉందని తెలుసుకున్న తండ్రి పోలీసులకు ఫిర్యాదు చేశారు.

ఆయన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

Advertisement

తాజా వార్తలు