నారాయణపేట జిల్లా కోస్గిలో అయ్యప్పస్వాముల ధర్నా

నారాయణ పేట జిల్లా కోస్గిలో అయ్యప్ప స్వాములు ధర్నాకు దిగారు.బైరి నరేశ్ వ్యాఖ్యలను నిరసిస్తూ అయ్యప్ప స్వాములు ఆందోళన కార్యక్రమం చేపట్టారు.

ఈ క్రమంలో అయ్యప్ప స్వాములను ఓ వ్యక్తి వీడియో తీయగా.నాస్తికుడు తమ వీడియో తీయొద్దని అయ్యప్ప భక్తులు తెలిపారు.

దీంతో సదరు వ్యక్తి అయ్యప్ప భక్తులతో వాగ్వివాదానికి దిగాడు.దీంతో వ్యక్తిపై అయ్యప్పస్వాములు మూకుమ్మడి దాడికి పాల్పడ్డారు.

స్థానికుల ద్వారా సమాచారం అందుకున్న పోలీసులు పరిస్థితిని అదుపులోకి తీసుకు వచ్చి బాధితుడిని పోలీస్ స్టేషన్ కు తరలించారు.

Advertisement
ఏజ్ అనేది ఇండస్ట్రీలో సమస్య కాదు.. మనీషా కోయిరాలా షాకింగ్ కామెంట్స్ వైరల్!

తాజా వార్తలు