అయ్యబాబోయ్ ఒకేరోజు ఏపీలో ఇన్ని కరోనా కేసులా.. ??

ప్రపంచ వ్యాప్తంగా ఎందరో ఊపిరి తీసుకున్న కరోనా ప్రస్తుతం తగ్గిపోతుందని దాదాపుగా ప్రజలందరు హాయిగా తమపనులు తాము చేసుకుంటున్నారు.

కానీ కరోనా ఎక్కడికి వెళ్లలేదని, అది మనమధ్యే దొంగలా తిరుగుతుందని గ్రహించలేక పోతున్నారు.

కోవిడ్ లాంటి వైరస్ లోకంలోకి అడుగు పెట్టడమే కానీ తిరిగిపోవడం అంటూ జరగదు.మరి వ్యాక్సిన్ వచ్చింది కదా అని ఆలోచిస్తున్నారా.

Ayyababoy How Many Corona Cases In One Day In Ap, Andhra Pradesh, Corona Virus,

ప్రస్తుతం వచ్చిన వ్యాక్సిన్ సామర్ధ్యం ఇంకా పూర్తి స్దాయిలో నిరూపించబడలేదు కదా.కాబట్టి యధావిధిగా కరోనా బారినుండి తప్పించుకోవడానికి తీసుకోవలసిన జాగ్రత్తలు పాటించవలసిందే.ఇకపోతే ఏపీలో కరోనా కేసుల సంఖ్య క్రమ క్రమంగా పెరుగుతూ వస్తుందట.

గత 24 గంటల వ్యవధిలో 43,770 మందికి కరోనా పరీక్షలు నిర్వహించగా, కొత్తగా 158 మందికి పాజిటివ్ అని నిర్ధారణ అయిందట.అత్యధికంగా తూర్పు గోదావరి జిల్లాలో 35 కేసులు.

Advertisement

పశ్చిమ గోదావరి జిల్లాలో 28, కృష్ణా జిల్లాలో 23, విశాఖ జిల్లాలో 18 కేసులు గుర్తించారు.అత్యల్పంగా నెల్లూరు జిల్లాలో 1, విజయనగరం జిల్లాలో 1, ప్రకాశం జిల్లాలో 2 కేసులు వచ్చాయి.

అదే సమయంలో 172 మంది కొవిడ్ ప్రభావం నుంచి కోలుకోగా, ఒకరు మృతి చెందారట.ఆ మరణం విశాఖ జిల్లాలో నమోదైందని అధికారులు పేర్కొన్నారట.

Advertisement

తాజా వార్తలు