ఈ నెల 22వ తేదీన అయోధ్యలో రామ మందిరం( Ayodhya Ram Mandir ) ప్రారంభోత్సవం జరగనున్న సంగతి తెలిసిందే.
ఈ ఆలయాన్ని 2500 ఏళ్లు చెక్కు చెదరకుండా ఉండేలా ఎన్నో జాగ్రత్తలు తీసుకుని నిర్మించారని సమాచారం అందుతోంది.
ఈ ఆలయం ప్రపంచంలోనే అతిపెద్ద మూడో దేవాలయం కావడం గమనార్హం.ఐరన్ వాడకుండా ప్రత్యేకమైన శిలలతో ఈ ఆలయాన్ని నిర్మించడం జరిగింది.
భారతదేశ సంస్కృతి, వారసత్వాలకు నిలువెత్తు రూపంగా ఈ ఆలయాన్ని నిర్మిస్తున్నారు.ప్రపంచంలోనే అత్యంత అద్భుతమైన నిర్మాణాలలో అయోధ్య రామమందిరం ఒకటి కాగా నిర్మాణ, సుందరీకరణ పనులు ప్రస్తుతం శరవేగంగా జరుగుతున్నాయి.1989 సంవత్సరంలోనే ప్రస్తుత రామ మందిరం డిజైన్ ను( Ram Mandir Design ) రూపొందించడం జరిగింది. ఎల్ అండ్ టీ కంపెనీ ప్రధాన ఆలయాన్ని నిర్మించగా ఉపాలయాలు, ఇతరత్రా నిర్మాణాలను టాటా కన్సల్టెన్సీ ఇంజనీరింగ్ లిమిటెడ్ నిర్మించడం గమనార్హం.
ఈ ఆలయ ప్రాంగణంలో 27 మొక్కలను 27 నక్షత్రాలకు సూచికగా గతంలోనే నాటడం జరిగింది.ఈ ఆలయ నిర్మాణం కోసం 115 దేశాల్లోని నీళ్లను 2587 ప్రాంతాల నుంచి తీసుకొచ్చిన మట్టిని వినియోగించారు.అయోధ్యలో( Ayodhya ) ఒక చిన్న టైలర్ దుకాణంను నడుపుతున్న సోదరులు రామయ్యకు లావణ్య వస్త్రాలను తయారు చేస్తున్నారు.
శ్రీరామనవమి( Srirama Navami ) రోజున బాల రాముడి విగ్రహంపై సూర్యుడి కిరణాలు పడేలా నిర్మాణం చేపట్టారని తెలుస్తోంది.
గర్భగుడిలో ప్రతిష్టిస్తున్న బాల రాముడి( Ram Lalla ) ఎత్తు 51 అంగుళాలు కావడం గమనార్హం.యూపీ, గుజరాత్, రాజస్థాన్ నుంచి ఈ ఆలయం కోసం ప్రత్యేక శిలలను తెప్పించారని తెలుస్తోంది.గత 30 ఏళ్లుగా దేశం నలుమూలల నుంచి సేకరించిన 2 లక్షల ఇటుకలను ఈ ఆలయం కోసం వాడుతున్నారు.
సికింద్రాబాద్ బోయిన్ పల్లిలోని అనురాధ టింబర్ డిపో నిర్వాహకులకు ఈ ఆలయానికి తలుపులను నిర్మించే కాంట్రాక్ట్ దక్కింది.అయోధ్య రామాలయం ప్రత్యేకతల గురించి తెలిసి నెటిజన్లు సైతం వావ్ అని కామెంట్లు చేస్తున్నారు.
తాజా వార్తలు
Download App
Channels
HomeEnglish NewsTeluguStop Exclusive StoriesFlash/Breaking NewsTrending NewsPoliticalMovieHealth TipsCrime NewsMovie ReviewsNRI NewsViral VideosBhakthi/DevotionalPress ReleasesViral StoriesQuotesPhoto TalksBaby Boy NamesBaby Girl NamesCelebrity ProfilesFollow Us!
Contact Us!
TeluguStop.com Media, Siya Residency, Sri Sri Circle, Khammam, Telangana- 507002info@telugustop.comPh No : 999-279-9973
About Us!
About UsJobsAdvertisingDMCA / RemovalTerms of UsePrivacy Policy