సోయాబీన్ సాగులో అధిక దిగుబడి కోసం మెలకువలు..!

సోయాబీన్ పంటను వర్షాకాలం లో సాగు చేస్తే దిగుబడి ఆశించిన స్థాయిలో పొందవచ్చు.

పప్పు జాతి పంటలలో ఒకటైన సోయాబీన్ తక్కువ కాలంలో మంచి దిగుబడి ఇచ్చే పంటగా చెప్పుకోవచ్చు.

కొన్ని సస్యరక్షణ పద్ధతులు పాటిస్తే సకాలంలో చీడపీడల బెడద లేకుండా ఎకరాకు దాదాపు పది క్వింటాళ్ల దిగుబడి పొందవచ్చు.సోయా బీన్ పంటకు చీడపీడల బెడద విపరీతంగా ఉంటుంది.

కాబట్టి మొదట పంట వేసేటప్పుడు, కిలో విత్తనాలలో ఏడు గ్రాముల ఇమిడక్లోప్రిడ్ ను కలిపి బాగా శుద్ధి చేసుకోవాలి.పైరు వేశాక మొలకలు వచ్చేటప్పుడు ఈగలు ఆశించే అవకాశం ఉంటుంది కాబట్టి ఎసిఫేట్ ను 1.0 గ్రాములు ఒక లీటర్ నీటిలో కలిపి మొక్కలకు పిచికారి చేయాలి.

సోయా బీన్ ఆకులు పసుపు లేదా గోధుమ రంగులోకి మారినప్పుడు రసం పీల్చే పురుగులు ఉన్నట్టుగా నిర్ధారించుకోవాలి.రసం పీల్చే పురుగులు, తామర పురుగులు, దోమలను నివారించడానికి ఒక లీటరు నీటిలో డైమిథోయట్ రెండు మిల్లీలీటర్లు కలిపి పిచికారి చేసుకోవాలి.ఆకులకు రంద్రాలు, ఆకులను తినడం, పువ్వులను, కాయలను లద్దె పురుగులు తినకుండా మొదటి రెండు దశలలో ఎసిఫేట్ 1.0 గ్రాములు పిచికారి చేయాలి.మూడవ దశలో లీటరు నీటిలో థాయోడి కార్బ్ గ్రాములు, క్లోరిఫైరిపీస్ తో కలిపి పొలంలో చల్లాలి.

Advertisement

పెంకు పురుగుల వల్ల కాండం లోపలి భాగం రంధ్రాలు పడి, కోమ్మలలో లోపలి పదార్థాలు, కొమ్మ చివరి భాగాలు ఎండిపోకుండా లీటరు నీటిలో రెండు మిల్లీలీటర్ల క్వినాల్ ఫాస్ కలిపి బాగా పిచికారి చేయాలి.ఆకులపై గూడులు, గుడ్లు లాంటివి ఏమైనా కల్పిస్తే వెంటనే ఆలస్యం చేయకుండా మోనోక్రోటోఫస్ 1.6 మిల్లీలీటర్లను లీటర్ నీటిలో కలిపి పిచికారి చేయాలి.సోయాబీన్ పంట వేశాక పురుగులు ఏమైనా ఆశిస్తున్నాయా అని ఎప్పటికప్పుడు గమనించి పిచికారీలు సరైన క్రమంలో చేయడం ద్వారా వాటి బెడద నుండి పంటను సంరక్షించుకొని మంచి దిగుబడి పొందవచ్చు.

Blaze: Seguridad Del Jugador Y Juego Responsable
Advertisement

తాజా వార్తలు