ఉదయం టిఫిన్ గా ఈ ఆహారాలు తీసుకుంటున్నారా? అయితే జంక్ ఫుడ్ తో సమానమే..

చాలామంది అల్పాహారంలో ( Breakfast ) మంచి మంచి టిఫిన్లు తినాలని కోరుకుంటూ ఉంటారు.

అలాగే ఈ మధ్యకాలంలో ఉన్న బిజీ లైఫ్ కారణంగా చాలామంది టిఫిన్ గా జంక్ ఫుడ్( Junk Food ) తీసుకుంటున్నారు.

అయితే అల్పాహారంలో కచ్చితంగా ఫైబర్ ప్రోటీన్ ఆరోగ్యకరమైన కొవ్వు ఉండే పదార్థాలు ఎంచుకోవాలి.కానీ బిజీ లైఫ్ కారణంగా చాలామంది ఏది పడితే అది తింటున్నారు.

దీని ద్వారా అనారోగ్యానికి పాలవుతున్నారు.అయితే ఉదయం పూట తీసుకోకూడని కొన్ని ఆహారాలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం.

ఉదయం నిద్ర లేవగానే చాలామంది కాఫీ తాగుతారు.ఇది వాళ్లకు ఒక అలవాటుగా ఉంటుంది.ఇది తాగిన తర్వాతే వారికి రిఫ్రెష్ గా అనిపిస్తుంది.

Advertisement

కానీ ఇది ఆరోగ్యానికి మాత్రం మంచిది కాదు.ఉదయాన్నే ఖాళీ కడుపుతో కాఫీ( Coffee ) తాగడం వల్ల జీర్ణ క్రియ సమస్యలు వస్తాయి.

ఆఫీసుకు వెళ్లే తొందరలో చాలామంది బ్రెడ్, జామ్ ను తింటారు.కానీ వైట్ బ్రెడ్ లో పోషకాలు తక్కువగా ఉంటాయి.

దీన్ని తీసుకుంటే జీర్ణ క్రియపై చెడు ప్రభావం పడుతుంది.అందుకే మల్టీ గ్రీన్ బ్రెడ్ ని తీసుకోవడం మంచిది.

ఉదయం పూట తాగడం కోసం పండ్లు, జ్యూస్ లు ఆరోగ్యానికి మంచివే.కానీ మార్కెట్లో లభించే ప్యాక్ చేసిన పండ్ల రసాలను కూడా చాలామంది తాగుతుంటారు.అయితే ఈ జ్యూస్లలో ప్రిజర్వేటివ్‌,షుగర్ ఉంటాయి.

రజనీకాంత్ తెలుగు సినిమాల్లో నటించకూడదని ఎందుకు నిర్ణయం తీసుకున్నాడు

ఇవి ఆరోగ్యాన్ని పాడు చేస్తాయి.అయితే ఈ మధ్యకాలంలో చాలామంది ప్రాసెస్ చేసిన తృణధాన్యాలను కూడా తీసుకుంటున్నారు.

Advertisement

అయితే ఉదయాన్నే వీటిని తీసుకోవడం ఆరోగ్యానికి అస్సలు మంచిది కాదు.ఎందుకంటే వీటిలో చక్కెర పరిమాణం చాలా ఎక్కువగా ఉంటుంది.

అందుకే మధుమేహం, ఊబకాయం, గుండెపోటు ప్రమాదం వస్తుంది.అందుకే సహజసిద్దమైన చిన్న ధాన్యాలు తీసుకుంటే చాలా మంచిది.బ్రేక్ ఫాస్ట్ లో పెరుగుకు బదులుగా చాలామంది ఫ్లేవర్డ్ పెరుగును తింటున్నారు.

ఇది ఒక ట్రెండు అయిపోయింది.ఇందులో షుగర్ కంటెంట్ చాలా ఎక్కువగా ఉంటుంది.

ఇది రక్తంలో చక్కెర స్థాయిని పెంచుతుంది.అందుకే ఉదయాన్నే ఫ్లేవర్డ్ పెరుగు తినడం చాలా ప్రమాదకరం.

తాజా వార్తలు