హార్మోన్ల అసమతుల్యతను అధిగమించాలంటే వీటికి దూరంగా ఉండాల్సిందే!

హార్మోన్ల అసమతుల్యత.ఇటీవ‌ల రోజుల్లో ప్రాధానంగా వినిపిస్తున్న పేరు ఇది.ముఖ్యంగా మ‌హిళ‌ల్లో హార్మోన్ల అస‌మ‌తుల్య‌త అధికంగా క‌నిపిస్తోంది.

హార్మోన్ల అస‌మ‌తుల్మ‌త అనేది మొత్తం ఆరోగ్యాన్నే ప్ర‌భావితం చేస్తుంది.

అధిక బ‌రువు, సంతానలేమి, ఋతుచక్రం క్రమం తప్పడం, మొటిమ‌లు, నిద్ర‌లేమి, అల‌స‌ట‌, ఒత్తిడి, హెయిర్ ఫాల్, జ్ఞాప‌క శ‌క్తి త‌గ్గ‌డం, ఎముక‌లు మ‌రియు కండ‌రాలు బ‌ల‌హీన ప‌డ‌టం, థైరాయిడ్‌ ఇలా హార్మోన్ల అసమతుల్యత వ‌ల్ల ఎన్నో స‌మ‌స్య‌లు త‌లెత్తుతాయి.అందుకే హార్మోన్ల అసమతుల్యతను అదిగమించడం ఎంతో అవ‌స‌రం.

అందుకోసం పోష‌కాహారం తీసుకోవ‌డం, డైలీ వ్యాయామాలు చేయ‌డ‌మే కాదు.కొన్ని కొన్ని ఆహారాల‌కు దూరంగా కూడా ఉండాలి.

మ‌రి ఆ ఫుడ్స్ ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం.కెఫిన్.

Advertisement
Avoid These To Overcome Hormonal Imbalance , Hormonal Imbalance, Bad Foods, Late

.ఆరోగ్యానికి మంచిదే అయిన‌ప్ప‌టికీ దాన్ని అధిక మొత్తంలో తీసుకున్న‌ప్పుడు హార్మోన్ల అసమతుల్యతకు కార‌ణం అవుతుంది.ఒక‌వేళ మీరు ఆల్రెడీ హార్మోనల్‌ ఇమ్‌బ్యాలెన్స్ తో బాధ‌ప‌డుతుంటే.

కెఫిన్ ఉండే కాఫీ, డార్క్ చాక్లెట్స్‌, ఎన‌ర్జీ డ్రింక్స్, సోడా వంటి వాటిని ఎవైడ్ చేయ‌డ‌మే ఉత్త‌మం.హార్మోన్ల అసమతుల్యతను అధిగమించాలంటే రెడ్ మీట్‌కు ఎంత దూరంగా ఉంటే అంత మంచిది.

ఎందుకంటే, రెడ్ మీట్‌లో సంతృప్త మరియు హైడ్రోజనేటెడ్ కొవ్వులు ఎక్కువ‌గా ఉంటాయి.ఇవి హార్మోన్ల అసమతుల్యతను మ‌రింత తీవ్రంగా మారుస్తాయి.

Avoid These To Overcome Hormonal Imbalance , Hormonal Imbalance, Bad Foods, Late

పాలు, పాలు ఉత్ప‌త్తులు.ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి.ఎన్నో ప్ర‌యోజ‌నాల‌ను అందిస్తాయి.

నెలలో రెండుసార్లు ఈ రెమెడీని పాటిస్తే 60 లోనూ తెల్ల జుట్టు దరిచేరదు!

అయితే వాటిని ఓవ‌ర్‌గా తీసుకుంటే మాత్రం మీ హార్మోన్ల సమతుల్యత దెబ్బతింటుంది.అందువల్ల, మీరు ఇప్పటికే హార్మోన్ల అసమతుల్యతను ఫేస్ చేస్తుంటే.

Advertisement

పాలు, పాల‌ ఉత్ప‌త్తులను చాలా అంటే చాలా ప‌రిమితంగా తీసుకోవాలి.

ఇక హార్మోన్ల అసమతుల్యతను అధిగమించాలంటే క్యాలీఫ్లవర్, బ్రోకలీ, కాలే వంటి క్రూసిఫెరస్ కూరగాయలు తీసుకోవ‌డం బాగా త‌గ్గించాలి.చ‌క్కెర‌, చ‌క్కెర‌తో త‌యారు చేసిన ఆహారాల‌ను పూర్తిగా ఎవైడ్ చేయాలి.మ‌రియు ప్రాసెస్ చేయబడిన ఆహారాలు, బేకరీ ఆహారాలను సైతం దూరం పెట్టాలి.

తాజా వార్తలు