Knee Pain : 30 ఏళ్లకే మోకాళ్ళ నొప్పులతో బాధపడుతున్నారా.. వర్రీ వద్దు ఇలా చెక్ పెట్టండి!

ఆహారపు అలవాట్లు, పోషకాల కొరత, కీళ్లపై తీవ్రమైన ఒత్తిడి, శరీరానికి శ్రమ లేకపోవడం తదితర కారణాల వల్ల ఇటీవల కాలంలో ఎంతో మంది 30 ఏళ్లకే మోకాళ్ళ నొప్పులతో బాధపడుతున్నారు.

ఈ సమస్య కారణంగా ఏ పని చేయలేకపోతున్నారు.

కొంచెం సేపు నిలబడాలన్నా, నడవాలన్నా ఎంతో అసౌకర్యానికి గురవుతుంటారు.మీరు ఈ జాబితాలో ఉన్నారా.

అయితే అస్స‌లు వ‌ర్రీ అవ్వకండి.ఇప్పుడు చెప్పబోయే మ్యాజిక‌ల్ మిల్క్ ను ప్రతిరోజు కనుక తీసుకుంటే ఎలాంటి మోకాళ్ళ నొప్పులు అయినా పరార్ అవ్వాల్సిందే.

మరి ఇంకెందుకు ఆలస్యం ఈ మ్యాజిక‌ల్ మిల్క్ ను ఎలా ప్రిపేర్ చేసుకోవాలో తెలుసుకుందాం పదండి.ముందుగా ఒక బౌల్ తీసుకొని అందులో 8 బాదం పప్పులు వేసి వాటర్ పోసి నానబెట్టుకోవాలి.

Advertisement
Avoid Knee Pain With This Magical Milk-Knee Pain : 30 ఏళ్లకే మో

అలాగే మరొక బౌల్ లో వన్ టేబుల్ స్పూన్ సోంపు గింజలు( Fennel Seeds ) వేసి వాటర్ పోసి నైట్ అంతా నానబెట్టుకోవాలి.మరుసటి రోజు ఉదయాన్నే మిక్సీ జార్ తీసుకొని అందులో నానబెట్టి పొట్టు తొలగించిన బాదం పప్పులు వేసుకోవాలి.

అలాగే నాన‌బెట్టిన‌ సోంపును వాటర్ తో సహా వేసుకుని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి.

Avoid Knee Pain With This Magical Milk

ఆ తర్వాత స్టవ్ ఆన్ చేసి గిన్నె పెట్టుకుని అందులో ఒక గ్లాసు ఆవు పాలు పోసుకోవాలి.పాలు బాగా హీట్ అయ్యాక అందులో గ్రైండ్ చేసుకున్న మిశ్రమాన్ని వేసి ఐదారు నిమిషాలు పాటు ఉడికించాలి.చివరిగా ఒకటిన్నర టేబుల్ స్పూన్ పటిక బెల్లం పొడి( Jaggery powder ) వేసి మరో రెండు నిమిషాల పాటు మ‌రిగిస్తే మ‌న మ్యాజిక‌ల్ మిల్క్ రెడీ అయిన‌ట్లే.

Avoid Knee Pain With This Magical Milk

ఈ బాదం సోంపు పాలు ఆరోగ్యపరంగా చాలా మేలు చేస్తాయి.ముఖ్యంగా మోకాళ్ళ నొప్పులను( Knee Pain ) తరిమి కొట్టడానికి అద్భుతంగా తోడ్పడతాయి.నిత్యం ఈ మిల్క్ ను తీసుకుంటే ఎముకల్లో సాంద్ర‌త పెరుగుతుంది.

ప్రవస్తి ఆరోపణల గురించి రియాక్ట్ అయిన సింగర్ సునీత.. ఆమె ఏమన్నారంటే?
భూకంపం ధాటికి భూమి కదిలింది.. ఉపగ్రహాలు చూసి షాక్.. ఎక్కడంటే?

బోన్స్ స్ట్రాంగ్ గా మారతాయి.మోకాళ్ళ నొప్పులు దూరం అవుతాయి.

Advertisement

అలాగే ఈ మిల్క్ జీర్ణక్రియను చురుగ్గా మారుస్తుంది.మ‌ల‌బ‌ద్ధ‌కం స‌మ‌స్య‌ను దూరం చేస్తుంది.

అదే సమయంలో మెదడు పనితీరును పెంచుతుంది.మరియు నిద్రలేమి సమస్యను సైతం నివారిస్తుంది.

తాజా వార్తలు