మీకు ఈ స‌మ‌స్య‌లు ఉన్నాయా.. అయితే నెయ్యి జోలికి వెళ్ల‌క‌పోవ‌డ‌మే బెట‌ర్‌!

నెయ్యి( Ghee ) పాల నుండి తయారయ్యే ఉత్పత్తుల్లో ఒకటి.పిల్లల నుంచి పెద్దల వరకు నెయ్యిని చాలా ఇష్టపడతారు.

ముఖ్యంగా వేడి వేడి అన్నంలో నెయ్యి, మంచి కూర లేదా ఆవకాయ పచ్చడి పప్పు వేసుకుని తింటే అమృతంలా అనిపిస్తుంది.పైగా నెయ్యి ఆరోగ్యకరమైనది.

నెయ్యిలో ఎన్నో పోషకాలు నిండి ఉంటాయి.రోజుకు ఒకటి నుంచి రెండు స్పూన్ల నెయ్యి తీసుకుంటే ఆరోగ్యానికి, చర్మానికి, జుట్టుకు చాలా మేలు జరుగుతుంది.

అయితే ఎంత రుచిగా ఉన్నా, ఎన్ని పోషకాలు ఉన్నా కొంద‌రు మాత్రం నెయ్యి జోలికి వెళ్ళకూడద‌ని నిపుణులు సూచిస్తున్నారు.మ‌రి ఆ కొందరు ఎవరు అనేది ఇప్పుడు తెలుసుకుందాం.

Advertisement

మ‌న శ‌రీరంలో అతిపెద్ద అవ‌య‌వం కాలేయం.అయితే ఇటీవ‌ల కాలంలో కాలేయ స‌మ‌స్య‌ల‌తో బాధ‌ప‌డుతున్న వారు భారీగా పెరుగుతున్నాయి.కాలేయ సమస్యలకు నెయ్యి కారణం కాదు.

కానీ మీకు ఇప్పటికే కామెర్లు, ఫ్యాటీ లివ‌ర్‌, జీర్ణశయాంతర నొప్పి వంటి కాలేయ సంబంధిత వ్యాధులు ఉంటే మీరు నెయ్యిని తీసుకోక‌పోవ‌డ‌మే ఉత్త‌మం.ఎందుకంటే నెయ్యి ఆయా స‌మ‌స్య‌ల‌ను మ‌రింత తీవ్ర‌త‌రం చేస్తుంది.

గుండె స‌మ‌స్య‌ల‌తో( Heart problems ) బాధ‌ప‌డుతున్న‌వారు నెయ్యికి ఎంత దూరంగా ఉంటే అంత మంచిది.నెయ్యిలో ఆక్సిడైజ్డ్ కొలెస్ట్రాల్ ఉంటుంది.ఇది గుండె జబ్బుల ప్రమాదాన్ని పెంచుతుంది.

పాలు అలెర్జీ ఉన్న వ్యక్తులు కూడా నెయ్యి తీసుకోక‌పోవ‌డ‌మే మంచిది.నెయ్యి ఒక పాల ఉత్పత్తి.

సమంత నాగచైతన్య విడాకులకు పిల్లలే కారణమా.. అసలు విషయం బయటపెట్టిన చైతన్య?
రహస్యంగా పెళ్లి చేసుకున్న టాలీవుడ్ స్టార్ సింగర్లు.. ఈ జోడి క్యూట్ కపుల్ అంటూ?

కాబ‌ట్టి నెయ్యి తీసుకోవడం వల్ల దద్దుర్లు, దద్దుర్లు, వాంతులు, విరేచనాలు వంటి స‌మ‌స్య‌లు త‌లెత్తుతాయి.ఒకవేళ అటువంటి స‌మ‌స్య‌లేమి లేక‌పోతే మీరు నిశ్చింత‌గా నెయ్యిని తీసుకోవ‌చ్చు.

Advertisement

అలాగే నెయ్యి తీసుకున్న ప్ర‌తిసారి కొంద‌రు అజీర్ణం, ఉబ్బరం వంటి స‌మ‌స్య‌ల‌తో ఇబ్బంది ప‌డుతుంటారు.అలాంటి వారు నెయ్యి జోలికి పోక‌పోవ‌డ‌మే మంచిది.

ఇక బరువు తగ్గించే ప‌నిలో ఉన్నట్లయితే.నెయ్యిని చాలా లిమిట్ తీసుకోవాలి.

వాస్త‌వానికి నెయ్యిలో కంజుగేటెడ్ లినోలెయిక్ యాసిడ్ ఉంటుంది.ఇది బరువు తగ్గడంలో ప్రజలకు బాగా సహాయపడుతుంది.

కానీ అదే నెయ్యి ని అధికంగా తీసుకుంటే ఊబకాయానికి దారితీస్తుంది.

తాజా వార్తలు