కర్వా చౌత్ ఉపవాసం రోజు వీటిని అస్సలు చేయకండి..?

వివాహమైన మహిళలు తన సౌభాగ్యం కోసం భర్త యోగక్షేమాల కోసం ఎన్నో పూజలు చేస్తూ ఉంటారు.

అలాంటి వాటిలలో ప్రముఖమైనది కర్వా చౌత్ ఉపవాసం( Karwa Chauth Fasting ) అని పండితులు చెబుతున్నారు.

మరి దీని ప్రత్యేకత ఏమిటి?ఈ సంవత్సరంలో ఇది ఎప్పుడు జరుపుకోవాలి.వంటి వాటి గురించి ఇప్పుడు తెలుసుకుందాం.

మహిళలు తమ ఆరో ప్రాణంగా భావించేవి పసుపు కుంకుమలు అని దాదాపు చాలామందికి తెలుసు.తమ తాళిబొట్టు నిండు నూరేళ్లు నిలవాలని, భర్త ఆయురారోగ్యాలతో విలసిల్లాలని ప్రతి భార్య కోరుకుంటున్నాం.

అందుకే భర్త శ్రేయస్సు కోసం వివాహమైన మహిళలు( Married Women ) ఎన్నో నోములు నోస్తారు.అలాగే వ్రతాలు( Vrat ) కూడా చేస్తూ ఉంటారు.

Advertisement
Avoid Doing These Mistakes While Doing Fasting On Karwa Chauth Details, Fasting

ఈ కోవకు చెందిన కర్వా చౌత్ ఉపవాసం ప్రతి సంవత్సరం ఎంతో వైభవంగా జరుపుకుంటారు.ముఖ్యంగా ఉత్తర భారత దేశంలో ఈ వేడుకను ఘనంగా చేసుకుంటారు.

లక్షలాది మంది వివాహిత మహిళలు తమ జీవిత భాగస్వామి క్షేమాన్ని కోరుకుంటూ కర్వా చౌత్ ఉపవాసాన్ని పాటిస్తారు.ఈ వేడుక శుభ ముహూర్తం ఒక్కో ప్రాంతానికి వేరే వేరే విధంగా ఉంటుంది.

దేశవ్యాప్తంగా నవంబర్ 1వ తేదీన కర్వా చౌత్( Karwa Chauth ) నిర్వహిస్తారు.ఈ రోజున సూర్యోదయం నుంచి చంద్రోదయం వరకు ఉపవాసం పాటిస్తారు.

అయితే ముహూర్తం విషయంలో కాస్త తేడాలు ఉంటాయి.

Avoid Doing These Mistakes While Doing Fasting On Karwa Chauth Details, Fasting
పిల్లలకు ఖాళీ కడుపుతో ఈ ఆహారాలు ఇవ్వండి.. ఏ రోగం కూడా దరిచేరదు..?

హిందూ సంప్రదాయం ప్రకారం వివాహం చేసుకున్న మహిళలకు అత్యంత కీలకమైన పండుగ అని చెబుతున్నారు.ఈ ఉత్సవం రోజు మహిళలు త్వరగా మేలుకొని తల స్నానం చేయాలి.కర్వా చౌత్ పూజ( Karwa Chauth Pooja ) విధానం ప్రకారం శివపార్వతులను గణపయ్యను పూజిస్తారు.

Advertisement

ఆ తర్వాత వారు ఏదైనా తింటారు.ఇదంతా సూర్యోదయానికి ముందే జరిగిపోవాలి.

ఏదైనా ఆకుకూర, పరోటా, కొబ్బరి నీళ్లు, డ్రై ఫ్రూట్స్ తీసుకుంటారు.ఇలా తీసుకోవడానికి సర్గి( Sargi ) అని పిలుస్తారు.

సూర్యుడు ఉదయించడానికి ముందే తినడం ముగించాలి.

మళ్ళీ రాత్రి చంద్రుడిని చూసేవరకు ఏమి తినకూడదు.కనీసం నీళ్లు కూడా తాగకూడదు.రాత్రి చంద్రుడు ఉదయించినప్పుడు మహిళలు జల్లెడలో భర్త మొఖాన్ని చూసిన తర్వాతే ఉపవాసం విరమించాలి.

కర్వా చౌత్ కోసం మహిళలు స్వచ్ఛమైన దుస్తులు ధరించాలి.ఉపవాసం విరమించిన తర్వాత తెలిపాటి ఆహారం తినాలి.

దీని వల్ల జీర్ణ వ్యవస్థ మీద ప్రభావం పడకుండా ఉంటుంది.ముఖ్యంగా చెప్పాలంటే హైదరాబాద్ లో సాయంత్రం 5 గంటల 40 నిమిషాల నుంచి ఏడు గంటల వరకు ఈ శుభ ముహూర్తం ఉంటుంది.

తాజా వార్తలు