ప్రపంచంలో ఒకరి పట్ల మరొకరు దయచూపితే అన్ని సమస్యలు క్షణాల్లో మటుమాయమవుతాయి.ఒకరి పట్ల దయ చూపడం అంటే అది చిన్న చర్య అయినా కావచ్చు.
చిరునవ్వు నవ్వడం, పడిపోతున్న వారిని పట్టుకోవడం, వృద్ధులను రోడ్డు దాటించడం, లగేజీ మోయడం, ఇలా రోజువారీ జీవితంలో ఇతరుల పట్ల దయ చూపడం ఎవరికైనా కుదురుతుంది.ఇలా చేస్తే అవతల వ్యక్తికి సంతోషాన్ని కలిగించడమే కాదు మనకి కూడా సంతోషం కలుగుతుంది.
అయితే ఈ విషయం తెలిసి కూడా జనాలు ఏమీ పట్టనట్లు వ్యవహరిస్తుంటారు.ఇతరులను ఎలా మోసం చేసి లాభం పొందాలా అని కొందరు ఆలోచిస్తే, మరికొందరు సాయం చేయడానికి తమకేం అవసరం అని గమ్మున ఉంటారు.
ఇలా ఉన్న సమాజంలో కొందరు మంచివారు ఉంటారు.ఎవరూ అడగకపోయినా వీరు ఇతరులకు మంచి చేస్తుంటారు.
అరుదుగా కనిపించే వీరు అప్పుడప్పుడు వీడియోలకు చిక్కుతూ సోషల్ మీడియాలో పాపులర్ అవుతుంటారు.ఈసారి ముంబైలోని ఓ ఆటో డ్రైవర్( Auto Driver ) తన మంచితనంతో సోషల్ మీడియా( Social media ) స్టార్‌గా మారాడు.
ఈ ఆటో డ్రైవర్ లక్షల్లో డబ్బులు సంపాదించకపోయినా వందల మందికి దానాలు చేస్తున్నాడు.తన ఆటోలో ఎక్కే ప్రయాణికులకు ఉచితంగా తాగునీరు, బిస్కెట్లు అందిస్తూ మానవత్వాన్ని చాటుకుంటున్నాడు.
నందిని అయ్యర్( Nandini Iyer ) అనే యువతి ఈ ఆటో డ్రైవర్ మంచితనాన్ని అందరికీ తెలియజేసింది.నందిని ఇటీవల ముంబైలోని చెంబూర్ ఏరియాలో ఈ ఆటోను ఎక్కింది.
తరువాత ఆశ్చర్యపోయింది.ఎందుకంటే డ్రైవర్ సీటు వెనుక అంటే ప్రయాణికులు కూర్చునే సీటుకు ముందు క్లీన్ వాటర్ బాటిల్స్, చాలా బిస్కెట్ ప్యాకెట్లు ఆమెకు కనిపించాయి.
వాటిని ప్రయాణికులు ఫ్రీగా తీసుకునేందుకే డ్రైవర్ ఇలా ఏర్పాటు చేశాడు.
ఈ మండే ఎండల్లో ఆటో డ్రైవర్ తన ప్రయాణికుల పట్ల చూపుతున్న శ్రద్ధను చూసి నందిని ఫిదా అయింది.అందుకే వెంటనే ఫ్రీగా అందిస్తున్న ఆ వాటర్ బాటిల్స్, బిస్కెట్లను ఫొటో తీసి ట్విట్టర్ వేదికగా షేర్ చేసింది.నందిని తన ట్విట్టర్ ఖాతాలో ట్వీట్ చేస్తూ "ముంబై ఆటోవాలా( Mumbai ) ఉచిత నీటిని ఇస్తున్నారు.
ఇది చూడటానికి చాలా సంతృప్తికరంగా ఉంది.దయను చూపించండి" అని ఒక క్యాప్షన్‌ను జోడించింది.
ఆ పోస్ట్‌కి 2,300 లైక్‌లు, 1 లక్షకు పైగా వ్యూస్ వచ్చాయి.చాలామంది నెటిజన్లు డ్రైవర్‌ను పొగిడారు.
తాజా వార్తలు
Download App
Channels
HomeEnglish NewsTeluguStop Exclusive StoriesFlash/Breaking NewsTrending NewsPoliticalMovieHealth TipsCrime NewsMovie ReviewsNRI NewsViral VideosBhakthi/DevotionalPress ReleasesViral StoriesQuotesPhoto TalksBaby Boy NamesBaby Girl NamesCelebrity ProfilesFollow Us!
Contact Us!
TeluguStop.com Media, Siya Residency, Sri Sri Circle, Khammam, Telangana- 507002info@telugustop.comPh No : 999-279-9973
About Us!
About UsJobsAdvertisingDMCA / RemovalTerms of UsePrivacy Policy