ఆస్ట్రియా: వైన్ సెల్లార్ బాగు చేస్తుండగా బయటపడిన షాకింగ్ దృశ్యం ?

ఇటీవల ఆస్ట్రియా( Austria )లోని ఒక వ్యక్తికి షాకింగ్ దృశ్యం కనిపించింది.ఆయన పేరు ఆండ్రియాస్ పెర్నర్‌స్టోర్ఫర్.

తన వైన్ సెల్లార్‌ను మరింత అందంగా మార్చడానికి ప్రయత్నిస్తుండగా పెద్ద పెద్ద ఎముకలు కనిపించాయి.అతను నేలను తవ్వడం ప్రారంభించగా, కలవరపాటుకు గురి చేసే దృశ్యం కనిపించింది.

వైన్ సెల్లార్ కింద దాదాపు 300 భారీ జంతువుల ఎముకలు కనిపించడంతో ఆయన ఒక్కసారిగా షాక్ అయ్యారు.మొదట, అవి పాత చెక్క ముక్కలు అని అతను అనుకున్నాడు, కానీ అవి చాలా పురాతనమైన మామూత్ ఎముకలు అని తేలింది.

దాంతో ఆశ్చర్య పోవడం అతడివంతయ్యింది.

Advertisement

మముత్‌లు( Mammoth ) చాలా పెద్ద జంతువులు, చాలా సంవత్సరాల క్రితం జీవించాయి.కాగా రీసెంట్‌గా దొరికిన ఎముకలు 30,000 నుంచి 40,000 సంవత్సరాల నాటివి అని తెలుస్తోంది.ఒకేసారి ఇన్ని మామూత్ ఎముకలు కనుగొనడం చాలా అరుదు.

ఆస్ట్రియాలో ఇలాంటిది ఇప్పటివరకు జరగలేదు, కాబట్టి ఇది చాలా ప్రత్యేకమైన ఆవిష్కరణగా మిగిలింది.

ఆండ్రియాస్‌( Andreas Pernerstorfer )కి తన తాత ఒక పెద్ద దంతాన్ని కనుగొన్నట్లు గుర్తువచ్చింది.దీంతో ఆ ఎముకలు ఒక భారీ జంతువుకి చెందినవి కావచ్చని అతను అనుకున్నాడు.ఎముకలు కనుగొన్న తర్వాత, వాటి గురించి మ్యూజియంకు చెప్పాలని నిర్ణయించుకున్నాడు.

ఇంకేం దొరుకుతాయో అని వారు మరింత తవ్వడం ప్రారంభించారు.ఈ ఎముకలు చాలా ముఖ్యమైనవి, ఎందుకంటే అవి మామూత్‌ల గురించి మరింత తెలుసుకోవడానికి సహాయపడతాయి.

పుష్పరాజ్ కూతురు కావేరిని తెగ ట్రోల్ చేస్తున్న నెటిజన్లు.. అసలేం జరిగిందంటే?
కాకినాడ సీపోర్ట్ వ్యవహారం .. సాయిరెడ్డి తో పాటు వీరికీ ఈడి నోటీసులు

అవి ఎలా జీవించాయి, ఆనాటి ప్రజలు వాటిని ఎలా వేటాడారో మనం తెలుసుకోవచ్చు.చివరి మామూత్‌లు సుమారు 4,000 సంవత్సరాల క్రితం జీవించాయి, కాబట్టి ఈ ఎముకలు ఒక చరిత్ర పుస్తకం లాంటివి.

Advertisement

ఈ ఎముకల ఆవిష్కరణ అనేది శాస్త్రవేత్తలకు మామూత్‌ల జీవన విధానం, వేటాడే పద్ధతుల గురించి మరింత అవగాహన కల్పిస్తుంది.అంతేకాకుండా, ఆ ప్రాంత చరిత్ర గురించి కూడా మరింత తెలుసుకోవడానికి సహాయపడుతుంది.

తాజా వార్తలు