టీ20 సీరీస్‌లో లంకను వైట్‌వాష్ చేసిన ఆసీస్

ఆస్ట్రేలియా శ్రీలంక మధ్య జరుగుతున్న టీ20 సీరీస్‌లో భాగంగా శుక్రవారం జరిగిన మూడో టీ20 మ్యాచ్‌లో ఆసీస్ జోరుకు లంక జట్టు బ్రేకులు వేయలేకపోయింది.

దీంతో మూడు మ్యాచ్‌ల టీ20 సీరీస్‌ను ఆసీస్ క్లీన్‌స్వీప్ చేసింది.

మెల్‌బోర్న్ వేదికగా జరిగిన మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన శ్రీలంక నిర్ణీత ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 142 పరుగులు చేసింది.లక్ష్యచేధనకు దిగిన ఆసీస్ బ్యాట్స్‌మెన్లు వార్నర్(60*), స్మిత్(53*) చెలరేగి ఆడటంతో కేవలం 17.3 ఓవర్లలోనే లక్ష్యాన్ని చేధించారు.వార్నర్ పరుగుల సునామీ ముందు లంక బౌలర్లు తేలిపోయారు.

వరుసబెట్టి బంతులను బండరీలకు పంపుతూ వార్నర్ లంక బౌలర్లను చితక్కొట్టాడు.ఇక లంక బౌలర్లలో కేవలం మలింగ ఒక్కడికే ఒక వికెట్ దక్కింది.అటు లంక జట్టులో ఏ ఒక్క బ్యాట్స్‌మెన్ కూడా నిలకడగా ఆడలేకపోయారు.పెరీరా(27) ఒక్కడే జట్టును నిలబెడదామని ప్రయత్నించినా అది ఫలించలేదు.కాగా ఆసీస్ బౌలర్లలో స్టాన్‌లేక్, కుమిన్స్, ఏజర్, జంపా తలా రెండు వికెట్లు పడగొట్టారు.

Advertisement

తాజా వార్తలు