ఫలించిన మోడీ కృషి.. భారత్‌కు భారీగా పెట్టుబడులు ప్రకటించిన ఆస్ట్రేలియా, ఎంతో తెలుసా..?

ప్రధాని నరేంద్ర మోడీ- ఆస్ట్రేలియా ప్రధాని స్కాట్ మోరిసన్‌ల మధ్య శిఖరాగ్ర స్థాయి చర్చలు ముగిసిన మరుసటి రోజు.

ఆస్ట్రేలియా సర్కార్ ఇండియాకు 280 మిలియన్ డాలర్ల విలువైన భారీ పెట్టుబడి ప్యాకేజ్‌ని ప్రకటించింది.

ఈ ప్యాకేజీ ఇరు దేశాల మధ్య ద్వైపాక్షిక, ఆర్ధిక సంబంధాన్ని పెంపొందించడానికి, వ్యాపారాలు, ఉద్యోగాలకు మద్ధతు ఇవ్వడానికి సహాయపడుతుందని నిపుణులు చెబుతున్నారు.మంగళవారం ఉదయం ఈ ప్యాకేజీని ఆస్ట్రేలియాకు చెందిన వాణిజ్యం, పెట్టుబడుల మంత్రి డాన్ టెహాన్ ప్రకటించారు.

దీని ప్రకారం.కేటాయింపులు చూస్తే, ఇండియాలోని ఆర్ధిక సంస్థలతో సంబంధాలను బలోపేతం చేయడానికి 16.6 మిలియన్ల సాయాన్ని అందించనుంది.మరో 8.9 మిలియన్ డాలర్లను భారత్‌లో పెరిగిన ఆస్ట్రేలియా వాణిజ్య కార్యకలాపాల నేపథ్యంలో బిజినెస్ ఎంగేజ్‌మెంట్‌ను మరింత పెంచడానికి అందించనున్నారు.ఆస్ట్రేలియా ఇండియా ఇన్నోవేషన్, టెక్నాలజీ ఛాలెంజ్‌ను ఏర్పాటు చేసేందుకు గాను ఉద్దేశించిన ఆస్ట్రేలియా- ఇండియా స్ట్రాటజిక్ రీసెర్చ్ ఫండ్ కోసం 17.2 మిలియన్ డాలర్లను కేటాయించారు.

గ్రీన్‌ స్టీల్ పార్టనర్‌షిప్, క్రిటికల్ మినరల్స్ రీసెర్చ్ పార్టనర్‌షిప్‌ కోసం 35.7 మిలియన్లను ప్రకటించారు.ఇది కీలకమైన ఖనిజాలు, ఇంధనం, క్లీన్ టెక్నాలజీల ఉత్పత్తి, పరిశోధన, వాణిజ్యీకరణపై సహకారాన్ని అందించనుంది.అంతరిక్ష రంగంలో మరింత లోతైన సహకారానికి గాను 25.2 మిలియన్లను కేటాయించారు.బహిరంగ చర్చలు, విధాన సంభాషణలను ప్రోత్సహించడానికి, భారతీయ కమ్యూనిటీ సంబంధాలను బలోపేతం చేయడానికి ఆస్ట్రేలియా- ఇండియా రిలేషన్ సెంటర్‌ ప్రారంభించేందుకు 28.1 మిలియన్ డాలర్లను కేటాయించారు.ఇండో - పసిఫిక్ ప్రాంతంలో ఆస్ట్రేలియాకు భారత్‌ ముఖ్యమైన భద్రత, ఆర్ధిక భాగస్వామి.2020లో ఆస్ట్రేలియాకు భారత్ ఏడవ అతిపెద్ద వాణిజ్య భాగస్వామి , సర్వీస్ ఎక్స్‌పోర్ట్స్‌కు సంబంధించి మూడవ అతిపెద్ద మార్కెట్.అలాగే టూ వే వాణిజ్యం విలువ 24.3 బిలియన్లు.

Advertisement
ఎంత ప్రయత్నించినా జుట్టు రాలడం ఆగట్లేదా.. అయితే మీరు ఇది ట్రై చేయాల్సిందే!

తాజా వార్తలు