భారతీయుడు2 సినిమాను నిజంగా శంకర్ డైరెక్ట్ చేశారా.. ఇంత చెత్త సినిమాను ఊహించలేదుగా!

స్టార్ డైరెక్టర్ శంకర్ ( Star director Shankar )డైరెక్షన్ లో ఏదైనా సినిమా తెరకెక్కిందంటే మన దేశంలోని ప్రేక్షకులు ఆ సినిమాపై దృష్టి పెడతారు.ఒకే ఒక్కడు, జీన్స్, అపరిచితుడు, శివాజీ, రోబో సినిమాలతో శంకర్ దర్శకునిగా తనకంటూ ప్రత్యేక ముద్రను సొంతం చేసుకోవడం ద్వారా వార్తల్లో నిలిచారు.

భారతీయుడు2 సినిమా ( bharateeyudu2 movie )నిన్న థియేటర్లలో రిలీజ్ కాగా ఈ సినిమా చూస్తున్న ప్రేక్షకులకు దర్శకుడు శంకర్ నిజంగానే ఈ సినిమా తెరకెక్కించారా అనే సందేహం కలిగింది.ఈ సినిమాలో కథ, కథనం ఏ మాత్రం ఆసక్తికరంగా లేకపోవడం, కొన్ని సీన్లు ప్రేక్షకులకు చిరాకు తెప్పించే విధంగా ఉండటం గమనార్హం.

శంకర్ నుంచి ఇలాంటి సినిమాను అస్సలు ఊహించలేదని సోషల్ మీడియా వేదికగా నెటిజన్లు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. ఇండియన్2, ఇండియన్3( Indian2, Indian3 ) ఒకే భాగంగా తెరకెక్కించి ఉంటే సినిమా ఫలితం మరోలా ఉండేదని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి.

ఇప్పటికే వరుస ఫ్లాపులతో ఎన్నో ఎదురుదెబ్బలు తిన్న లైకా ప్రొడక్షన్స్ ( Lyca Productions )కు ఈ సినిమా భారీ స్థాయిలో నష్టాలను మిగల్చడం గ్యారంటీ అని చెప్పడంలో సందేహం అక్కర్లేదు.సినిమా సినిమాకు శంకర్ తన స్థాయిని తగ్గించుకుంటున్నారని కామెంట్లు వినిపిస్తున్నాయి.భారతీయుడు2 రిజల్ట్ వల్ల గేమ్ ఛేంజర్ విషయంలో సైతం చరణ్ ఫ్యాన్స్ తెగ టెన్షన్ పడుతున్నారు.

Advertisement

గేమ్ ఛేంజర్ మూవీ రిలీజ్ కావడానికి మరో ఐదు నెలల సమయం పట్టే అవకాశం ఉంది.శంకర్ తన మార్క్ ను మిస్ అవుతూ ఫ్యాన్స్ ను తగ్గించుకుంటున్నారు.శంకర్ కు ఇలాంటి పరిస్థితి ఎదురు కావడం ఆయన అభిమానులను ఒకింత కంగారు పెడుతోంది.

శంకర్ కే ఎందుకు ఇలా జరుగుతోందంటూ ఫ్యాన్స్ కామెంట్లు చేస్తున్నారు.

Advertisement

తాజా వార్తలు