ప్రజాస్వామ్యాన్ని గౌరవించే విచారణకు హాజరు.. రేవంత్ రెడ్డి

ప్రజాస్వామ్యాన్ని గౌరవించే సిట్ విచారణకు హాజరు అయినట్లు తెలంగాణ పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి తెలిపారు.

టీఎస్పీఎస్సీ పేపర్ లీక్ కేసులో విట్ నెస్ కింద సిట్ ఎదుట రేవంత్ రెడ్డి హాజరైన సంగతి తెలిసిందే.

ఈ క్రమంలో రేవంత్ రెడ్డి స్టేట్ మెంట్ ను సిట్ అధికారులు రికార్డ్ చేశారు.సిట్ విచారణ అనంతరం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ కీలక వ్యాఖ్యలు చేశారు.

పేపర్ లీక్ వ్యవహారంలో అసలు నేరస్థులను పట్టుకోకుండా తమకు నోటీసులు ఇస్తున్నారని చెప్పారు.ప్రశ్నించే వారిని భయపెట్టేందుకు ప్రయత్నిస్తున్నారని మండిపడ్డారు.

కేసీఆర్ ప్రభుత్వం ప్రతిపక్షాల గొంతునొక్కాలని చూస్తోందని ఆరోపించారు.

Advertisement
మీకు తెలుసా : ఉప్పు ఎక్కువ తింటున్నారా అయితే తస్మాత్‌ జాగ్రత్త

తాజా వార్తలు