సీఎం జగన్ పై రాళ్లదాడి ఘటనలో పోలీసు అధికారులపై వేటు..!!

ఏప్రిల్ 13వ తారీకు వైసీపీ అధినేత సీఎం జగన్( CM Jagan ) పై విజయవాడలో బస్సు యాత్రలో రాయి దాడి జరగడం తెలిసిందే.

ఈ ఘటన ఏపీ రాజకీయాలలో( AP politics ) సంచలనం సృష్టించింది.

సరిగ్గా జగన్ ఎడమ కనుబొమ్మపై రాయి బలంగా తాకటంతో రక్తం కూడా రావడం జరిగింది.దీంతో వెంటనే బస్సు పై నుండి లోపలికి వెళ్లి.

ప్రథమ చికిత్స చేయించుకుని ఆరోజు యాత్ర ముగించారు.అనంతరం వెంటనే విజయవాడ ప్రభుత్వాసుపత్రిలో.

వైద్యం చేయించుకోవడం జరిగింది.ఈ ఘటనలో ఇప్పటికే రాయి దాడి చేసిన వ్యక్తిని పోలీసులు పట్టుకుని.

Advertisement
Attack On Police Officers In The Incident Of Stone Pelting On CM Jagan , AP CM J

విచారణ చేయడం జరిగింది.ఆ వ్యక్తి ప్రస్తుతం నెల్లూరు జైల్లో ఉన్నారు.

Attack On Police Officers In The Incident Of Stone Pelting On Cm Jagan , Ap Cm J

పరిస్థితి ఇలా ఉండగా సీఎం జగన్ పై రాళ్లదాడి నేపథ్యంలో ఈసీ స్పందించింది.ఇద్దరు పోలీసు అధికారులపై బదిలీ వేటు వేసింది.విజయవాడ సీపీ కాంతి రానా( CP Kanti Rana ) టాటా, ఇంటలిజెన్స్ చీఫ్ పిఎస్ఆర్ ఆంజనేయులును బదిలీ చేసింది.

తక్షణమే వారిని విధుల నుంచి తొలగించాలని ఆదేశించింది.వారికి ఎన్నికలతో సంబంధం లేని విధులు అప్పజెప్పాలని ఈసీ ఆదేశించింది.ఈసీకి వచ్చిన పలు ఫిర్యాదుల ఆధారంగా వారిద్దరిపై వేటు వేసినట్లు తెలుస్తోంది.

సీఎం జగన్ పై రాయి దాడి ఘటన ఏపీ రాజకీయాలను కుదిపేసింది.ఈ ఘటనలో భద్రతా వైఫల్యం ఉందని వివరస్థాయిలో విమర్శలు వచ్చాయి.

ఇండియా గొప్పదా? పాకిస్థాన్ గొప్పదా? ఆతిథ్యంపై కెనడా వ్యక్తిని అడిగితే.. మైండ్ బ్లోయింగ్ ఆన్సర్..
విజయ్ దేవరకొండ ఒకేసారి ఇద్దరు స్టార్ హీరోలను లైన్ లో పెట్టాడా..?

ఈ క్రమంలో ఎలక్షన్ కమిషన్ ఇద్దరు పోలీసు ఉన్నతాధికారులను బదిలీ చేయటం ఏపీ రాజకీయాల్లో సంచలనంగా మారింది.

Advertisement

తాజా వార్తలు