Atlee: బర్త్ డే మంత్ లో మేమరబుల్ హిట్స్ అందుకున్న అట్లీ.. ఆ సినిమాలు ఎంటి?

ప్రస్తుతం సౌత్ ఇండియాలో నెంబర్ వన్ స్థానానికి దూసుకెళ్తున్నాడు దర్శకుడు అట్లీ.

( Atlee ) పదేళ్ల క్రితం సినిమా ఇండస్ట్రీకి దర్శకుడిగా పరిచయమై కేవలం ఐదు సినిమాలతోనే పాన్ ఇండియా డైరెక్టర్ గా మారిపోయాడు.

ఈ పదేళ్ల సమయంలో ఐదు సినిమాలు తీయగా ఆ ఐదు కూడా విజయాలు సాధించి బాక్స్ ఆఫీస్ వద్ద వసూళ్లు కురిపించడం విశేషం.తీసిన ప్రతి సినిమా హిట్టు కొట్టడం అనేది తెలుగులో రాజమౌళి( Rajamouli ) చెల్లితే ఇప్పుడు అట్లే కూడా ఇదే దోవలో ప్రయాణం చేస్తున్నాడు.

అయితే అట్లీ సెప్టెంబర్ 21న జన్మించాడు.ఆయన పుట్టిన ఈ నెలలోనే అట్లీ కెరియర్ బెస్ట్ రెండు సినిమాలు కూడా విడుదల అయి సంచలన విజయాలను నమోదు చేశాయి.

మొదటగా అట్లీ దర్శకత్వం వహించిన సినిమా రాజా రాణి.( Raja Rani Movie ) ఈ సినిమాలో నయన తార, నాజ్రియ, ఆర్యన్ హీరో హీరోయిన్స్ గా నటించిన సెప్టెంబర్ 27, 2013 నా ఈ సినిమా విడుదలై మంచి విజయాన్ని సాధించడంతో పాటు నయనతార( Nayanthara ) మొదట లక్కీ హీరోయిన్ గా అట్లీ కెరీర్ కి గట్టి పునాది పడింది.ఈ సినిమా తర్వాత అట్లీ కి వరుస సినిమాలతో పాటు విజయాలు కూడా దక్కాయి.

Advertisement

ఇక సెప్టెంబర్ నెలలోనే విడుదలై ఘన విజయం సాధించిన మరొక సినిమా జవాన్.( Jawan Movie ) ఈ సినిమాలో షారుక్ ఖాన్, నయన తార, దీపికా పదుకొనే హీరో హీరోయిన్స్ గా నటించారు.

ఈ చిత్రం కూడా బాలీవుడ్ తో పాటు యావత్ ఇండియాలోనే మంచి సినిమాగా పేరు గడించడమే కాకుండా బాక్సాఫీస్ దుమ్ము దులిపి 1000 కోట్ల కలెక్షన్స్ దిశగా పరిగెడుతుంది.ఈ సినిమా ద్వారా హిందీ చిత్ర పరిశ్రమ లోకి అట్లీ తొలిసారిగా పరిచయమయ్యాడు.ఇక జవాన్ సినిమాలో కూడా నయనతార హీరోయిన్గా నటించిన అట్లీ కి మరోసారి లక్కీ హీరోయిన్ అనే ముద్రను కాపాడుకుంది.

ఇలా సెప్టెంబర్( September ) మాసంలో అట్లీకి ఎంతో గుర్తింపు తెచ్చిన ఈ రెండు సినిమాలు విడుదల విజయం సాధించడం పైగా ఈ రెండు సినిమాల్లో కూడా నయనతార హీరోయిన్గా ఉండటం అనేది గమనించాల్సిన విషయం.మరి ముందు ముందు ఇంకేంటి సినిమాలు సెప్టెంబర్ నెలలో విడుదల చేసి హిట్స్ కొడతాడో వేచి చూడాలి.

రవితేజ కి రెమ్యూనరేషన్ ఎక్కువగా ఇస్తే కథ కూడా వినకుండా సినిమా చేసేస్తాడా..?
Advertisement

తాజా వార్తలు