ఆంధ్రప్రదేశ్ తెలుగుదేశం అధ్యక్షుడు అచ్చం నాయుడుకు( Acchennaidu ) తెలుగు తమ్ముళ్లపై కోపం వచ్చింది.
అధికారాన్ని అందివ్వడానికి ప్రజల సిద్ధంగా ఉన్నప్పటికీ అందుకోవడానికి తనతో సహా ఎవరు సిద్దం గా లేరని సంచలన వాఖ్యలు చేశారు .
అవసరం అయినంత స్థాయిలో ఎవరూ పనిచేయడం లేదంటూ ఆయన చేసిన వ్యాఖ్యలు సంచలనం గా మారాయి .ప్రస్తుత ప్రభుత్వం పై ఆగ్రహంగా ఉన్న ప్రజలు తెలుగుదేశం( TDP ) ఆగమనం కోసం చూస్తున్నారని, తెలుగుదేశానికి అధికారం అప్ప చెప్పడానికి వారు మానసికంగా సిద్ధమయ్యారని అయితే అవకాశాన్ని అందుకోవడానికి మాత్రం తెలుగుదేశం నేతలు ఆక్టివ్ గా లేరంటూ ఆయన విమర్శలు చేశారు.
నియోజకవర్గ స్థాయిలో నాయకులలో కదలిక లేదని ప్రజల ను ఆకట్టుకోవడానికి సరైన విధంగా ప్రయత్నాలు చేయడం లేదని నిర్మాణాత్మక కార్యక్రమాలు చేస్తూ ప్రజల్లో యాక్టివ్ గా ఉండాల్సిన సమయంలో పార్టీ నేతల్లో నిర్వేదం కనిపిస్తుంది అంటూ ఆయన క్లాస్ పీకారు.ప్రతి విషయాన్ని చంద్రబాబుతో( Chandrababu Naidu ) చెప్పించుకునే వరకు రావద్దు అంటూ ఆయన తమ్ముళ్లకు సూచించారు.పార్టీకి భవిష్యత్తు లేదంటూ అంతకుముందు ఆయన చేసిన వ్యాఖ్యలు రాష్ట్రవ్యాప్తంగా సంచలనం కలిగించిన విషయం తెలిసిందే .ఈ వ్యాఖ్యలను అస్త్రం గా చేసుకున్న అధికార పార్టీ ఆ వాఖ్యలను తన అనుకూల మీడియా ద్వారా భారీగా ప్రచారం చేసి తెలుగు దేశానికి దెబ్బ కొట్టింది.
ఇప్పుడు మరొకసారి సొంత పార్టీ నేతలపై అచ్చన్న చేస్తున్న విమర్శలు ఏ పరిణామలకు దారితీస్తాయో చూడాలి.దీనిపై తెలుగుదేశం అదినేత చంద్రబాబు ప్రధాన కార్యదర్శి లోకేష్ రియాక్షన్ ఎలా ఉంటుందో చూడాలి.అయితే అచ్చన్న వ్యాఖ్యలను సమర్థిస్తున్నవారూ లేకపోలేదు తెలుగు తమ్ముళ్లలో మరింత ఉత్సాహంగా పని చేయాలనే ఉద్దేశంతో తోనే ఆయనలా మాట్లాడారు తప్ప కార్యకర్తలు నిరుత్సాహపరచడానికి కాదని కొందరికి వాఖ్యనిస్తున్నారు .ఏది ఏమైనా సొంత పార్టీ నేతలు పైన అసంతృప్తి వ్యక్తం చేస్తున్న అచ్చెన్న వ్యవహార శైలి మాత్రం చర్చనీయాంశం గా మారింది .
తాజా వార్తలు
Download App
Channels
HomeEnglish NewsTeluguStop Exclusive StoriesFlash/Breaking NewsTrending NewsPoliticalMovieHealth TipsCrime NewsMovie ReviewsNRI NewsViral VideosBhakthi/DevotionalPress ReleasesViral StoriesQuotesPhoto TalksBaby Boy NamesBaby Girl NamesCelebrity ProfilesFollow Us!
Contact Us!
TeluguStop.com Media, Siya Residency, Sri Sri Circle, Khammam, Telangana- 507002info@telugustop.comPh No : 999-279-9973
About Us!
About UsJobsAdvertisingDMCA / RemovalTerms of UsePrivacy Policy