Bhairava Pepper: ఈ సమయంలో భైరవునికి నేతి అన్నం మిరియాలతో దీపం వెలిగిస్తే ధన లాభం కలుగుతుందా..

చాలామంది ప్రజలు ప్రతిరోజు భగవంతులకు పూజలు చేసి హారతులు ఇస్తూ ఉంటారు.

ఇలా పూజలు చేస్తూ వారి ఇంట్లో ఎప్పుడూ ధనలక్ష్మి ఉండాలని, ఎటువంటి ఆర్థిక సమస్యలు ఉండకూడదని దేవుని ముందు కోరుకుంటున్నారు.

ఇంకా చెప్పాలంటే వారి ఇంటిలోని కుటుంబ సభ్యులంతా ఆరోగ్యంగా ఉండాలని కఠినమైన ఉపవాసలను పాటిస్తూ ఉంటారు.అష్టమి రోజున భైరవుడ్ని పూజించడం ద్వారా అష్టలక్ష్మి అనుగ్రహం, భైరవ అనుగ్రహం వారి ఇంటి పై ఉండడమే కాక వారి ఇంట్లోని చాలా రకాల ఆర్థిక సమస్యలు దూరమవుతాయని వేద పండితులు చెబుతున్నారు.

భరణి నక్షత్రం రోజున భైరవుడికి ప్రత్యేకమైన పూజలు చేయడం వల్ల చాలా పుణ్య ఫలితాలను పొందే అవకాశం ఉంది.భైరవుడు భరణి నక్షత్రంలో అవతరించడం వల్ల భరణి నక్షత్రం వారు భైరవుడ్ని పూజిస్తే విశిష్ట పుణ్యఫలాలను పొందుతారు.

అమావాస్య రోజు భైరవుడ్ని పూజించడం వల్ల సకల దిష్టి దోషాలను దూరం చేయవచ్చు.కాలభైరవునికి అమావాస్య అష్టమి తిధులలో ఎరుపు రంగు పువ్వులను సమర్పించి పూజ చేయడం వల్ల ఎంతో మంచిది.

Advertisement

అలాగే మిరియాల దీపం వెలిగించడం వల్ల మానసిక బాధలు తొలగిపోయే అవకాశం ఉంది.అమావాస్య రోజున అన్నదానం చేయడం వల్ల కాలభైరవుడు సంతోష పడతాడు.భైరవ అష్టమి రోజున అన్నంలో తేనె కలిపి వడ్డిస్తే మంచిది.

ఇంకా చెప్పాలంటే ఆరోజు పేదవారికి ఆర్థిక సహాయం చేయడం కూడా ఎంతో మంచిది.ఆ తర్వాత దీనివల్ల వ్యాపారాలలో లాభం వచ్చే అవకాశం ఉంది.

కాలభైరవుని ఆలయంలో రాహుకాలంలో రుద్రాభిషేకం నిర్వహిస్తే మనసులో ఉన్న మంచి కోరికలన్నీ నెరవేరుతాయి.భైరవ సహస్రనామ కార్యక్రమం నిర్వహిస్తే వివాహం త్వరగా అవుతుంది.

కాలభైరవునికి ప్రతి శనివారం బిల్వంతో సహస్ర నామ అర్చన చేస్తే శుభకార్యాలు జరిగే అవకాశం ఉంది.అంతేకాకుండా ఈతి బాధలు కూడా తగ్గే అవకాశం ఉందని వేద పండితులు చెబుతున్నారు.

కలోంజీ గింజల్లో అద్భుత ఔషధ గుణాలు
Advertisement

తాజా వార్తలు