ఆ క్షణం ఒణికి పోయా.. నిద్ర కూడా పట్టలేదు: చిరంజీవి

మెగాస్టార్ చిరంజీవి రీ ఎంట్రీ తర్వాత ఊహించిన స్థాయిలో హిట్ మాత్రం పడలేదని చెప్పాలి.

ఖైదీ నెంబర్ 150 సైరా నరసింహారెడ్డి పరవాలేదు అనిపించినప్పటికీ ఆచార్య సినిమా మాత్రం డిజాస్టర్ గా నిలిచింది.

ఇలా ఆచార్య వంటి డిజాస్టర్ సినిమా తర్వాత చిరంజీవి ప్రేక్షకుల ముందుకు వచ్చిన చిత్రం గాడ్ ఫాదర్.ఈ సినిమా మలయాళ సూపర్ హిట్ సినిమా లూసిఫర్ చిత్రానికి రీమేక్ చిత్రంగా ప్రేక్షకుల ముందుకు వచ్చింది.

మోహన్ రాజ దర్శకత్వంలో తెరికెక్కిన ఈ సినిమా విజయదశమి సందర్భంగా విడుదలయ్యే ఎంతో అద్భుతమైన విజయాన్ని అందుకుంది.ఈ సినిమా అందుకున్న విజయంతో ఆచార్య లోటు కూడా పూర్తి అయిందని మెగా అభిమానులు సంతోషం వ్యక్తం చేయడమే కాకుండా బాస్ ఈస్ బ్యాక్ అంటూ పెద్ద ఎత్తున సంతోషం వ్యక్తం చేస్తున్నారు.

ఇక ఈ సినిమా అన్ని చోట్ల మంచి విజయాన్ని సొంతం చేసుకోవడంతో శనివారం హైదరాబాదులో చిత్ర బృందం సక్సెస్ మీట్ కార్యక్రమాన్ని నిర్వహించారు.ఈ కార్యక్రమంలో భాగంగా చిరంజీవి మాట్లాడుతూ ఎన్నో ఆసక్తికరమైన విషయాలను వెల్లడించారు.

Advertisement

ఈ క్రమంలోనే చిరంజీవి మాట్లాడుతూ.సాధారణంగా ఒక సినిమా విడుదల అవుతుందంటే చిత్ర బృందం ఎలాంటి ఆందోళనకు గురవుతారో అందరికీ తెలిసిందే ఎంతో మంది ఆర్టిస్టులు టెక్నీషియన్లు రాత్రి పగలు తేడా లేకుండా సినిమా కోసం కష్టపడతారు.ఇలా సినిమా కోసం ఎంతో కష్టపడిన నటీనటులు ఆ సినిమా ఎలాంటి ఫలితాన్ని అందుకుంటుందోనని ఆందోళన చెందుతూ ఉంటారు.

ఇలా గాడ్ ఫాదర్ సినిమా విడుదలకు ముందు తన కన్నా తన భార్య సురేఖ ఎక్కువ ఆందోళన వ్యక్తం చేశారని చిరంజీవి వెల్లడించారు.సురేఖ పడుతున్న టెన్షన్ చూసి తాను కూడా ఎంతో ఒణికి పోయానని చిరంజీవి వెల్లడించారు.

విడుదలకు ముందు రోజు రాత్రి తనకు నిద్ర కూడా పట్టలేదని చిరంజీవి ఈ సందర్భంగా చేసిన వ్యాఖ్యలు వైరల్ అవుతున్నాయి.అయితే ఈ సినిమాకి ప్రేక్షకులు అందించిన విజయం చూసి చాలా సంతోషంగా ఉందని ఈ సందర్భంగా తన సంతోషాన్ని వ్యక్తం చేశారు.

మన చేతి రేఖలలో మార్పులు జరుగుతాయా... ఈ మార్పు దేనికి సంకేతం?
Advertisement