మీ పనులన్నీ చేసి పెట్టే మొబైల్ ఆప్

మీరు క్రికేట్ చూడాలి, ఫోన్ చేతిలో పట్టుకోని " ఒపెన్ స్టార్ స్పోర్ట్స్‌ " అనగానే స్టార్ స్పోర్ట్స్‌ ఓపెన్ అయిపోతే ఎలా ఉంటుంది? ఎవరికైనా ఫోన్ చేయాలనుకుంటే కాంటాక్ట్స్ ఓపెన్ చేసి డయల్ చేయాల్సిన అవసరం లేదు, ఫలానా వ్యక్తికి ఫోన్ చేయమని ఇలా ఆర్డరు వేస్తే మీ ఫోన్ దానంతటికి అదే డయల్ చేసేస్తుంది.

మీరు ట్వీట్ చేయాలన్నా, ఫేస్ బుక్ లో పోస్ట్ పెట్టాలన్నా , గూగుల్ లో ఏదైనా వెతకాలన్నా, ఇలా ఆర్డరు వేస్తే , అలా చేసేస్తుంది మీ ఫోను.

ఈ సమయానికి నిద్రలేపు అంటే ఆ సమయానికి నిద్రలేపుతుంది.ఇవి మాత్రమే కాదు, ఎన్నో ఇంకెన్నో పనులు చేస్తుంది మీ ఫోను.

ఇదంతా ఒక ఆప్ మహిమ.దాని పేరు " అసిస్టెంట్ "(Assiatant), పేరుకి తగ్గట్టే మీకు అసిస్టెంట్ లా పనిచేస్తుంది.

నమ్మాలనిపించకపోతే ఇప్పుడే గూగుల్ ప్లే స్టోర్ లోకి వెళ్ళి ఈ అప్లికేషన్ ని డౌన్లోడ్ చేసుకోండి.ఇలా ఆర్డరు వేసి, మీకు మొబైల్ లో ఏం పని కావాలో ఆ పని చేయించుకోండి మీ అసిస్టెంట్ తో.

Advertisement
న్యూస్ రౌండప్ టాప్ 20

తాజా వార్తలు